(అక్టోబర్ 10న ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు) ఆ నాడు దేశంలో అరాచకం అలుముకున్న వేళ ఛత్రపతి వీరోచిత పోరాటం చేసి, మళ్ళీ మన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించారు. అదే తీరున తెలుగు సినిమా ప్రాభవం తరిగిపోతున్న వేళ మరోమారు ప్రపంచ యవనికపై తెలుగు చిత్రాల వెలుగును ప్రసరింప చేసిన ఘనుడు దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లో తెరకెక్కిన ‘స్వర్గసీమ’, ‘మల్లీశ్వరి’, ‘పాతాళభైరవి’ వంటి చిత్రాలు ఎల్లలు దాటి ప్రదర్శితమై, తెలుగు చిత్రాల ఉనికిని చాటాయి.…
(అక్టోబర్ 8న మంచు లక్ష్మి బర్త్ డే) నటి, నిర్మాత, నిర్వహాకురాలుగా మంచు లక్ష్మి సాగిన తీరే వేరు. తెలుగు చిత్రసీమలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నటనలో అడుగుపెట్టిన అమ్మాయిలు చాలా కొద్దిమందే కనిపిస్తారు. వారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. తండ్రి మోహన్ బాబు తనదైన కంచుకంఠంతో విలక్షణమైన పాత్రల్లో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. అదే తీరున మంచు లక్ష్మి సైతం వరైటీ రోల్స్ తో నటనలో అలరించారు. మాతృభాష తెలుగులో నటించక…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న తీరు.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శనాస్త్రాలతో రెండు నెలలపాటు టాలీవుడ్ వాతావరణం వేడెక్కింది. ఇటు ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. లోకల్ – నాన్ లోకల్ వివాదం, మా భవనం, పోస్టల్ బ్యాలెట్ వివాదాలతో పాటుగా మహిళా ఆర్టిస్టులు కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో ఈసారి పోటీదారుల ఫలితంపై ఎన్నడూ లేనంత ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే.. ఓటింగ్…
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన ‘ఇక్షు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో రెండో సినిమాను మొదలెట్టారు. ‘ఇక్షు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి. రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ 2 చిత్రం గురువారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘ఎంఎల్ఏ’ ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి. ఎస్. రావు కెమెరా…
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9:45 కి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.…
‘మా’ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మా భవనాన్ని తన సొంత డబ్బు కడతానని హామీ ఇచ్చారు.. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని… భవిష్యత్ అవసరాలు తీర్చేలా మా భవనం కడతామని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టో లో మొదటి ప్రాధాన్యత అవకాశాలైన మా ఆప్ రెడీ చేస్తామని.. జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మంచు విష్ణు మేనిఫెస్టోలోని…
2017 అక్టోబర్ 7వ తేదీ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున గోవాలో హిందు సంప్రదాయ పద్ధతిలోనూ, ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలోనూ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పదేళ్ళ స్నేహం, ఏడేళ్ళ ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధం అక్టోబర్ 2న పటాపంచలైపోయింది. అదే జరిగి ఉండకపోతే, ఇవాళ వారిద్దరూ అందరికీ దూరంగా ఏకాంతంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని ఉండేవారేమో! చైతు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో…
‘మా’ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పోటీదారుల విమర్శలతో ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతుతో మెగా అండదండలు ఉన్నాయి. తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదాలపై ఆయన స్పందించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్రాజ్ కావాలి. ఉత్తమ నటుడిగా ప్రకాష్రాజ్ను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకు..? తెలుగు నటులు…
నటుడు సీవీఎల్ నరసింహారావు మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ ప్యానల్ పై సంచలన కామెంట్స్ చేశారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి.…
యార్లగడ్డ వెంకట రమణ నిర్మాణ సారధ్యంలో సాయిరాం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఆవిర్భావ సభ పూజాకార్యక్రమాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”సాయిరాం ప్రొడక్షన్స్ ఇవాళ ఆవిర్భవించింది. ఒక మంచి రోజున ఈ నిర్మాణ సంస్థ మొదలవడం ఆనందంగా ఉంది. నిర్మాత పద్మారెడ్డి చాలా ఏళ్లుగా తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీ లో ముప్పై ఏళ్లుగా ఉన్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి గారితో ఆయన…