కరోనా సెకండ్ వేవ్ తరువాత చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజుకొంటుంది.. నిన్న విడుదలైన ‘అఖండ’ చిత్రం థియేటర్లో రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని నమోదు చేసుకొని రికార్డుల కలెక్షన్లు సృష్టిస్తోంది. ఇక డిసెంబర్ చిత్రాలకు శుభారంభం అయినట్లే.. ఈ సినిమా తరువాత అందరి చూపు అల్లు అర్జున్ ‘పుష్ప’ పైనే ఉంది. డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. డిసెంబర్ 6 న ట్రైలర్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేసిన మేకర్స్ రోజుకో పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు.
ఇక తాజాగా ‘ట్రైలర్ టీజ్’ అనే పేరుతో ట్రైలర్ లోని మెయిన్ కట్స్ ని వీడియోగా బంధించి వదిలారు. ఈ టీజ్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా కనిపిస్తోంది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటిని పరిచయం చేస్తూ.. పుష్ప రాజ్ ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకొంటుంది. బన్నీ, రష్మిక, అనసూయ, సునీల్, అజయ్ పాత్రలను చూపించారు.. ఇక ఫస్ట్ పార్ట్ లో సునీల్ విలన్ అని, సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాజిల్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్న వేళ ఈ ట్రైలర్ లో ఫహద్ ఫాజిల్ ని కూడా చూపించడం విశేషంగా మారింది. బ్యాక్ షాట్ లో ఫహద్ ఫాజిల్ కనిపించి కనువిందు చేశాడు.
అందరు అనుకున్నట్లు కాకుండా సుకుమార్ చాలా గట్టిగా ప్లాన్ చేసినట్లు ఈ టీజ్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఏదిఏమైనా ఈ ‘పుష్ప’ రాజ్ రచ్చ మాత్రం సోషల్ మీడియాలో మాములుగా లేదు. ఈ టీజ్ చూసాకా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ చిత్రంతో బన్నీ- సుకుమార్ హ్యాట్రిక్ హిట్ ని అందుకుంటారో లేదో చూడాలి.