ప్రస్తుతం అందరి చూపు ఓటిటీల మీదే పడింది. ఎంచక్కా ఇంటి దగ్గరే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకప్రేక్షకుల అభిరుచి మేరకు స్టార్స్ సైతం ఓటిటీకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోహీరోయిన్లందరు ఓటిటీకి పరిచయమయ్యారు. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో హిట్ అందుకొంది. ఇక సామ్ బాటలోనే చైతూ సైతం ఓటిటీ బాట పట్టాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చైతన్య ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్ లతో…
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోష్ పెంచుతున్నాడు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దమవుతుండగా లూసిఫర్ సెట్స్ మీద ఉంది.ఇక వీటితో పాటు బాబీ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న చిరంజీవి నేడు దానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు పూజాకార్యక్రమాలతో మొదలయ్యింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. కళ్ళకు గాగుల్స్, చేతిలో సిగరెట్ తో మాస్ లుక్…
స్టార్ యాంకర్ సుమ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైపోయింది. బుల్లితెరపై తన సత్తాచాటిన సుమక్క వెండితెరపై కూడా తన సత్తా చాటనుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా విదుదల చేశారు. ఈ చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్లో…
మెగాస్టార్ చిరంజీవిని అందరూ ద రియల్ ఫ్యామిలీ మేన్ అంటూ ఉంటారు. తాను ఎంత బిజీగాఉన్నా, తన కుటుంబాన్ని మాత్రం ఆయన ఎన్నటికీ మరచిపోరని సన్నిహితులు చెబుతూంటారు. అలాగే తన బంధుమిత్రులను, అభిమానులను సైతం ఆయన కుటుంబంగానే భావిస్తుంటారు. అలాంటి చిరంజీవి సొంత మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను గురించి ఆలోచించకుండా ఉంటారా చెప్పండి. సాయిధరమ్ రోడ్డు ప్రమాదం కారణంగా ఆసుపత్రి పాలయినప్పటి నుంచీ చిరంజీవి, అతని యోగక్షేమాలు విచారంచడమే కాదు, ఎప్పటికప్పుడు వైద్యుల ద్వారా తన…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వవిడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలనే నెలకొల్పేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ని రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో మేకర్స్ రిలీజ్ చేశారు. 1970ల కాలంలో, కలకత్తాలో తిరుగులేని బెంగాలీ నాయకుడిగా నాని…
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు నటుడు జగపతి బాబు లాంచ్ చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్బిఏ, ఎమ్సిఏలు చదవలేకపోతివి` అంటూ…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. దానితో పాటే తమిళ సినిమా ‘కర్ణన్’ రీమేక్ లోనూ నటించబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించాడు. ఇది కాకుండా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ నూ చేయబోతున్నట్టు తెలిపాడు. దీనిని అతని తండ్రి బెల్లంకొండ సురేశ్ నిర్మించబోతున్నారు. రెండు రోజుల ముందు రవితేజ సైతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో తానూ తగ్గేది లే అంటున్నాడు సాయి శ్రీనివాస్. దీపావళి…
హన్సిక ప్రధాన పాత్రధారిణిగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో తీస్తున్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే ఈ తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అంటే నాకు ఇష్టం. అలా మనవాళ్ళు చెయ్యట్లేదు అనుకుంటున్న టైమ్ లో ‘105 మినిట్స్’ పేరుతో సినిమా చేశారు. కథ,…
యంగ్ హీరో నితిన్ తన భార్య షాలినికి గన్ గురిపెట్టాడు.. వామ్మో ఇటీవలే పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఏమైంది… అని కంగారుపడకండి.. ఇదంతా దీపావళి పండగలో భాగమే.. కరోనా తరువాత అందరు సంతోషంగా కలిసి చేసుకుంటున్న పండగ దీపావళీ. దీంతో సెలబ్రిటీలందరు తమ తమ కుటుంబ సభ్యులతో దీపాలను వెలిగించి, అందరు బావుండాలని పూజలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా నితిన్ వైఫ్ షాలిని తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయాలపాలయ్యారు. ఇటీవల తన ఇంటి జిమ్లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతికి గాయమైనట్లు తెలుస్తోంది. కుడి చేతి వేలుకు గాయం కావడంతో నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొద్దిరోజులు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం. మరో నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్న ఎన్టీఆర్ అనంతరం కొరటాల శివ షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఇకపోతే దీపావళి పండుగరోజు అభిమానులకు శుభాకాంక్షలు…