నందమూరి బాలకృష్ణ గురించి చిత్ర పరిశ్రమకే కాదు ఆయన అభిమానులకు కూడాతెలిసిందే. బాలయ్య మాట కఠినమే కానీ మనసు వెన్న అనేది జగమెరిగిన సత్యం. అనేది అనేసి.. ఆ తరువాత కామ్ గా ఉంటారు. దానిగురించి ఇంకెవరు మాట్లాడినా పట్టించుకోరు ఇది ఆయన మనస్తత్వం. బాలయ్య మీద ట్రోల్స్ రావడం సాధారణమే .. వాటిని ఆయన పట్టించుకొన్నది లేదు. ఇక రాజకీయాల పరంగా, చిత్ర పరిశ్రమ పరంగా బాలయ్య ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఆ హేటర్స్ కి…
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇండియా, జీ.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్, మరియు a+s మూవీస్ పతాకంపై మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట రిలీజ్ కి ముహూర్తం…
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ జె స్టాష్, తన ప్రేయసిని హత్య చేసి తానుకూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే జె స్టాష్ గా పేరు గాంచిన జస్టిన్ జోసెఫ్ అమెరికాలో ర్యాపర్ గా ఫేమస్. అతడి సాంగ్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గతకొద్దికాలంగా స్టాష్, జెనటీ గాలెగోస్ అనే మహిళతో రిలేషన్ ని కొనసాగిస్తున్నాడు. ఆమెకు అంతకుముందే పెళ్ళై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ఈ…
చిరంజీవి, రామ్ చరణ్ తో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న ‘ఆచార్య’ సినిమా సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘శానా కష్టం…’ పాట యు ట్యూబ్ ని షేక్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను చిరంజీవి, రెజీనాపై చిత్రీకరించారు. ఈ పెప్పీ నెంబర్ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.…
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. గణత్రంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు తప్పుకోవడంతో ‘ఉనికి’ మూవీని జనవరి 15న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మూవీ గురించి నిర్మాతలు బాబీ…
రోజురోజుకు కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. చిత్ర పరిశ్రమలో ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా పలువురు స్టార్లు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె కాకుండా ఆమె ఫ్యామిలీ అంతా కరోనాతో పోరాడుతున్నారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా…
బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకొంటుంది. ట్విట్టర్ లో ఉదయం నుంచి దీపికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికాకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దీపికా ఫోటోను షేర్ చేస్తూ” అందమైన నవ్వు కలిగిన దీపికా పదుకొనే కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ ఎనర్జీ, టాలెంట్ తో ప్రాజెక్ట్ కె సెట్.. మరింత ప్రకాశంవంతంగా…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు చలనచిత్ర జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన చేసిన సాహసాలు, అందుకు జనం మెచ్చి ఇచ్చిన విజయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఓ వైపు హీరోగా విజయయాత్ర చేస్తూన్న యన్టీఆర్ 1960లో దర్శకత్వం చేపట్టాలని భావించారు. ‘సీతారామకళ్యాణం’లో రావణబ్రహ్మ పాత్రలో నటించి, దర్శకత్వం వహించి మెప్పించారు. ఆ సినిమాకు దర్శకునిగా తన పేరు ప్రకటించుకోలేదు. ఆ తరువాతి సంవత్సరం మరో ప్రయత్నంగా దర్శకత్వం వహిస్తూ, నటించి ‘గులేబకావళి కథ’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా దర్శకునిగా…
మెరుపు తీగెలాంటి మేనిసోయగంతో చూపరులను ఇట్టే ఆకర్షించే రూపం అందాల దీపికా పడుకోణె సొంతం. దక్షిణాదికి చెందిన ఈ తార ఉత్తరాదిని ఉడికించింది. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పడుకోణె పెద్దకూతురు దీపిక. ఒకప్పుడు ప్రకాశ్ కూతురుగా ఉన్న గుర్తింపును ఇప్పుడు దీపిక తండ్రి ప్రకాశ్ పడుకోణె అనే స్థాయికి తీసుకు వెళ్ళింది ఆమె అభినయ పర్వం. నవతరం నాయికల్లో దీపికా పడుకోణె తనదైన బాణీ పలికిస్తూ బొంబాయి సినిమా పరిశ్రమను ఏలుతున్నారు. దీపికా పడుకోణె మన…
ఆ రోజుల్లో డాన్స్ మాస్టర్ సలీమ్ పేరు తెరపై కనిపించగానే థియేటర్లలో ఈలలు మారుమోగి పోయేవి. తెలుగువాడు కాకపోయినా సలీమ్ తెలుగు చిత్రసీమలోని అగ్రశ్రేణి కథానాయకులందరికీ నృత్యరీతులు సమకూర్చి అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300 పైచిలుకు చిత్రాలకు సలీమ్ డాన్స్ కంపోజ్ చేశారు. మళయాళ సీమలో కన్ను తెరచిన సలీమ్ బాల్యం నుంచీ పచ్చని పొలాల మధ్య చిందులు వేస్తూ గడిపాడు. అతని డాన్సుల్లో ఈజ్ ను గమనించిన…