ప్రముఖ నేపధ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే లతా కరోనాతో పాటు న్యుమోనియాతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. అందుకే వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని బయటకు తెలపడం లేదని చెన్నై వర్గాలు తెలుపుతున్నాయి. 92 ఏళ్ల లతా గతకొన్నిరోజులుగా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు లతా ఆరోగ్యపరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులు కానీ, వైద్యులు కానీ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె మళ్లీ క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.