ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఆహా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ స్థాపించిన ఈ ఓటిటీ ప్లాట్ ఫార్మ్ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. టాప్ ఓటిటీ ప్లేట్ ఫార్మ్ లలో ఒకటిగా ఆహా నిలబడగలిగింది. ఇక దీనికోసం అల్లు అరవింద్, అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నారు అనేది వాస్తవం. ఇందులో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు.. ఆయన కూడా ఆహా కోసం తనవంతు కృషి చేస్తున్నాడు అని అణ్డరు అనుకుంటున్న తరుణంలో ఆహా కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కుండబద్దలుకొట్టి చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక ఆహా యూజర్ తనకు ఆహా యాప్ రావడం లేదని, యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలను చెబుతూ దీనిని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆహా వీడియోస్ టీంతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను కూడా ట్యాగ్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై శిరీష్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
” డియర్ ఆహా టీం.. చాలామంది ప్రజలు నేను ఆహా లో ఇన్వాల్వ్ అయ్యాననుకొని నన్ను ట్యాగ్ చేస్తున్నారు. దయచేసి వారి సమస్యలను పరిష్కరించండి” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ తో అల్లు శిరీష్ కి ఆహా కి సంబంధం లేదని తెలుస్తోంది. అయితే తండ్రి కొడుకులు అల్లు అరవింద్, అల్లు అర్జున్ కలిసి నడిపిస్తున్న ఈ ఓటిటీ కి శిరీష్ కి సంబంధం ఎందుకు ఉండదు.. అతను కూడా అల్లువారి వారసుడడే కదా.. అని కొందరు అనుమానిస్తున్నారు. ఇంకొందరు.. శిరీష్ కి, ఆహా కి సంబంధం లేదా..? ఇప్పటివరకు శిరీష్ ఆహా పనులు చూసుకొంటున్నాడు అనుకున్నామే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది
ఇకపోతే ప్రస్తుతం శిరీష్ వెకేషన్ మోడ్ లో ఉన్నాడు. గత రెండేళ్ల నుంచి ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయని శిరీష్.. కొత్త ప్రేమకథ” ప్రేమ కాదంట” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికోసం శిరీష్ బాగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆహా పై శిరీష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Dear @ahavideoIN, lots of ppl tagging me thinking I'm involved with Aha. Kindly address the customer complaints. https://t.co/xbt4xkdfhr
— Allu Sirish (@AlluSirish) January 15, 2022