టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫిట్ నెస్ ఫ్రీక్ అందరికి తెలిసిందే. ఆమె అంత అందంగా ఉండటానికి కారణం నిత్యం రష్మిక జిమ్ లు, యోగాలు చేస్తుండటమే.. అయితే జిమ్ లో అమ్మడు ఎంత కష్టపడుతుందో ఆమె అప్పుడప్పుడు పెట్టె వీడియోలు చూస్తే తెలుస్తోంది. ఇక ఆమె ట్రైనర్ కులదీప్ సేథీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రేటిస్ కి ఆయనే ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రష్మిక, తన జిమ్ ట్రైనర్ పై రివెంజ్ తీర్చుకోవడం మిస్ అయ్యానని బాధపడుతోంది. ఇటీవల కులదీప్ పుష్ప సినిమాలోని రష్మిక సాంగ్ సామీ సామీ కి స్టెప్స్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రష్మిక ను ట్యాగ్ చేశాడు.
ఇక అమ్మడు సైతం ఆ వీడియోను పోస్ట్ చేస్తూ” కులదీప్.. రోజు జిమ్ లో నన్ను టార్చర్ చేస్తాడు.. ఒకే వర్క్ అవుట్ ని పదేపదే చేయమని ఇబ్బందిపెడతాడు.. ఈ సాంగ్ చేసేటప్పుడు నేను పక్కన లేను.. ఒకవేళ ఉండిఉంటే ఒక స్టెప్ ను పదేపదే చేయించి రివెంజ్ తీర్చుకోనేదాన్ని.. ఆ ఛాన్స్ మిస్ అయ్యాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మీకులా చేయాలంటే.. ఆయన చాలా టెక్స్ తీసుకోవాల్సి వస్తుంది.. వదిలేయండి అని కొందరు.. నువ్వు లేవు కాబట్టే పర్ఫెక్ట్ గా వచ్చింది అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అమ్మడు పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. మరోపక్క బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టలను లైన్లో పెట్టి బిజీగా మారింది.