‘మానాడు’ హీరో రానా కాదు… మరి ఎవరు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ తమిళ చిత్రం ‘మానాడు’ తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని భాషల రీమేక్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో హీరోగా నటించేది ఎవరనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ కాకుండా రీమేక్ చేయబోతున్నట్టు, తమ నిర్మాణ భాగస్వామిగా ఏషియన్ ఫిలిమ్స్ వ్యవహరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఈ రీమేక్ కు సంబంధించిన మిగిలిన వివరాలేవీ ఆయన ఇంతవరకూ ప్రకటించలేదు.
శింబు హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా 2021లో తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలో విలన్ గా ఎస్. జె. సూర్య చక్కటి నటన కనబరిచాడు. కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా మెప్పించింది. ఇది శింబు కు రైట్ కమ్ బ్యాక్ మూవీ అని చూసి వాళ్ళంతా కితాబిచ్చారు. అయితే దీనిని తెలుగులో రానా హీరోగా సురేశ్ బాబు తెరకెక్కించబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దీనిని తన రెండో కొడుకు అభిరామ్ తో రీమేక్ చేయడానికి సురేశ్ బాబు హక్కులు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో అభిరామ్ ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత అతనితోనే ‘మానాడు’ను సురేశ్ బాబు రీమేక్ చేస్తాడట. అతి త్వరలోనే దర్శకుడితో పాటు ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి, అధికారిక సమాచారం ఇస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే… అభిరామ్ ఖాతాలో కెరీర్ ప్రారంభంలోనే ఓ డిఫరెంట్ మూవీ పడినట్టే!
Also Read
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!