భారతీయ యవనికపై పోతపోసిన గ్రీకు శిల్పంలా నిలిచి జనం మనసు గెలిచాడు హృతిక్ రోషన్. గ్రీకువీరుడులాంటి శరీరసౌష్టవం సొంతం చేసుకున్న హృతిక్ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు…
ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం…
ఆ రోజుల్లో సుప్రీమ్ హీరో చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబో అంటే జనానికి ఎంతో క్రేజ్. అప్పటికే వీరిద్దరి కలయికలో రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను భమ్ చిక భమ్ ఆడించాయి. అలా చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో రూపొందిన ‘దొంగమొగుడు’ చిత్రం 1987 జనవరి 9న విడుదలై విజయపథంలో పయనించింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో అప్పటికే పలు నవలా చిత్రాలు సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవలకు మరింత కథ…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. గతకొన్ని రోజుల నుంచి కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రమేష్ బాబును చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. ఇకపోతే రమేష్ కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో చిన్నప్పటి అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు. “దొంగలకే…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రానా దగ్గుబాటితో ఆటలు ఆడిన బాలయ్య.. నెక్స్ట్ సంక్రాంతి ఎపిసోడ్ కి మరింత వినోదం పంచడానికి రెడీ ఐపోయారు. సంక్రాంతి స్పెషల్ గా అన్ స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్ గా లైగర్ టీమ్ విచ్చేసింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ, నటి కమ్ నిర్మాత ఛార్మితో బాలయ్య సందడి చేయనున్నారు.…
నాచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి ల నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. “మన చిత్ర పరిశ్రమలో మరో తెలివైన సినిమా.. శ్యామ్ సింగరాయ్ ఒక అద్భుతమైన అనుభవం రాహుల్ సాంకృత్యన్ . ఇప్పటివరకు…
గత యేడాది ‘డర్టీ హరి’ మూవీ కోసం చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, ఆ సినిమాకు వివిధ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన స్పందనతో వెంటనే మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. అదే ‘7 డేస్ 6 నైట్స్’ మూవీ. దీన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర…
కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ త్రీ డీ సినిమాను నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాల్సిందిగా దిగ్గజ ఓటీటీ కంపెనీలు నిర్మాతలపై ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజం ఉందని జాక్ మంజునాథన్ తెలిపారు.…
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దిల్రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూస్తుంటే…
దిల్రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ..…