చిత్ర పరిశ్రమను కరోనా వదలడం లేదు. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. స్టార్లందరూ కరోనా బారినపది ఐసోలేషన్స్ లో ఉండడంతో అభిమానులు భయాందోళనలకు గురవుతన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని లేకుండా అన్ని చోట్ల కరోనా విళయతాండవం సృష్టిస్తోంది. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు.
” అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను నిన్న కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డాను. తేలికపాటి జ్వరం తప్ప నేను బాగానే ఉన్నాను. సంబంధిత అధికారుల సూచనల మేరకు నేను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా మాస్క్ వేసుకుని జాగ్రత్త వహించండి” అని తెలిపారు. పండగ పూట ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని, మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానూలు కామెంట్స్ పెడుతున్నారు.