ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పుష్ప’ ఐటెం సాంగ్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత, అల్లు అర్జున్ మాస్ స్టెప్పులతో అలరించిన ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా డాన్స్ లతో ఈ సాంగ్ ని ఊపేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు ఈ సాంగ్ కి చిందులు వేసి మెప్పించగా .. తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి కూడా ఈ హాట్ సాంగ్ కి హాట్ స్టెప్పులు వేసి మెస్మరైజ్ చేసింది. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంతా కాదు. నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూ.. డాన్స్ లతో చెలరేగిపోతుంది.
ఇక తాజాగా ప్రగతి జిమ్ లో వర్క్ అవుట్ తరువాత ‘పుష్ప’ సాంగ్ తో చిల్ అయ్యింది. ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ కి తనదైన స్టైల్లో స్టెప్పులు ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రగతి స్టెప్పులకు ఫిదా అయినా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ వయస్సులో ఏం సాంగ్స్ చేస్తున్నావ్.. అని కొందరు అంటుండగా.. మరికొందరు ‘పుష్ప’ లోని ఊ అంటామే పాప.. ఊఊ అంటామా పాప లైన్నీ కాస్తా మార్చి “ఊ అంటాం ఆంటీ.. ఊఊ అంటామా ఆంటీ” అంటూ పాడేస్తున్నారు. మొత్తానికి ప్రగతి ఊ అంటావా ఊఊ అంటావా అంటూ వేసిన స్టెప్పు లతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.