గత యేడాది చివరి వారంలో మంచు మనోజ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇప్పుడు అదే కరోనా… మంచు లక్ష్మీని పట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపింది. ఇదే సమయంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా…
టాలీవుడ్ లో మంచి సినిమాలను వెలికి తీసి తెలుగు ప్రేక్షకులకు అందించడంలో సురేష్ ప్రొడక్షన్స్ ముందు వరుసలో ఉంటుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ట్యాలెంట్ ఉన్న నటులను ఒడిసిపట్టాలన్నా.. వేరే భాషలో హిట్ అయినా సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలన్నా దగ్గుబాటి వారసులకే చెల్లింది. అలానే వెంకటేష్ టాలీవుడ్ లో ఏ హీరో చేయనన్ని రీమేక్ లు చేసి హిట్ లు అందుకున్నాడు. ఇక సురేష్ బాబు సైతం వేరే భాషలో సినిమా…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాడు. తన చిత్రం ‘సామాన్యుడు’ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. డెబ్యూ డైరెక్టర్ టి.పి. శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామాను జనవరి 14న విడుదల చేయాలని తొలుత భావించారు. కానీ అనివార్యంగా ఈ మూవీ విడుదల 26కి వాయిదా పడింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశాల్ దీనిని నిర్మించారు. డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా.…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హైదరాబాద్ లో సన్ది చేశారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఫేమస్ రెస్టారెంట్ 1980’s మిలటరీ హోటల్ ని సందర్శించారు. అక్కడ ఫేమస్ హైదరాబాద్ రుచులన్నింటిని టేస్ట్ చేసి లంచ్ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హైదరాబాద్ వంటకాలు అంటే తనకు చాలా ఇష్టమని శివకార్తికేయన్ పలు సందర్బాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో ఈ హీరో తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్…
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం రోజు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 12 వరకూ…
సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన పాటను…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకదాని తరువాత ఒకటి సంక్రాంతి నుంచి పండగ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అభిమానులు ఖుషి అయ్యే న్యూస్ చెప్పాడు. గత…
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రేపే ఓటిటీ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించిన సినిమా.. సమంత ఐటెంసాంగ్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎంత కష్టపడిందో సామ్ తాజాగా…
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు. ‘రంగమార్తాడ’ సినిమా గురించి కృష్ణవంశీ చెబుతూ.. ‘నా అభిమాన నటుడు, నట రాక్షసుడు ప్రకాశ్ రాజ్ తో ఎమోషనల్ క్లయిమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నాను’ అని పేర్కొన్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం,…
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తన వారసుల్ని చిత్రసీమలో నటీనటులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారుడు క్రాంతితో నట్టికుమార్ స్వీయ దర్శకత్వంలో ‘వర్మ’ (వీడు తేడా) అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి మొదట ‘సైకో వర్మ’ అనే పేరు పెట్టారు. అయితే సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సైకో పదాన్ని టైటిల్ నుండి తొలగించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు నట్టి కుమార్ తెలిపారు. ఓ…