Naveen Chandra: నవీన్‌చంద్ర కొత్త చిత్రం ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం కీలకపాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. శ్రీ, కావ్య సమర్పణలో ఈ చిత్రాన్ని థింక్ బిగ్ పతాకంపై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్. విజయ్, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీ షిరిడిసాయి మూవీస్ పై యం. రాజశేఖర్ రెడ్డి, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వాలీ మోహన్‌దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తనికెళ్ల భరణి పూజతో సినిమా ప్రారంభం అయ్యింది. దర్శకుడు వేగేశ్న సతీష్,రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను దర్శకుడు వాలీ, నిర్మాతలు విజయ్, రాజశేఖర్ అందుకున్నారు. నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నంపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు నటుడు అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కు ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు.
కథను నమ్మి తనతో ట్రావెల్ చేయటానికి ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్, ఏ.ఎల్ విజయ్, నవీన్‌చంద్ర కు నిర్మాత రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కథతో నిజ జీవితంలో ఎంతో మంది స్ఫూర్తి చెందుతారని, అలాంటి కథతో వచ్చిన దర్శకుడు వాలీకి అభినందనలు తెలిపాడు నవీన్ చంద్ర. తను నటించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ ను రాజశేఖర్ రెడ్డి తమిళంలో ‘కేరాఫ్ కాదల్’గా తీసి తనను తమిళ ఆడియన్స్ కు పరిచయం చేశారని కార్తీక్ రత్నం చెప్పాడు. కథ నచ్చి సినిమాలో భాగం అయ్యానని ఎ.ఎల్. విజయ్ తెలిపాడు. ప్రారంభోత్సవంలో నిర్మాత బి.నర్సింగరావు, నటుడు రాజారవీంద్ర, దర్శకుడు శ్రీపురం కిరణ్, ‘గుణ 369’ ఫేమ్ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల, దర్శకుడు గౌతమ్ పట్నాయక్ కూడా పాల్గొన్నారు. వాణీబోజన్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించే ఈ చిత్రానికి శివమల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
Also Read
తాజావార్తలు
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?