Aparna Bala Murali: కోలీవుడ్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో సూర్య పాత్ర ఎంత గుర్తుండిపోతుందో అతని భార్యగా నటించిన అపర్ణ పాత్ర కూడా అంతే గుర్తుండిపోతుంది.. అపర్ణ బాలమురళి.. మలయాళ హీరోయిన్. ఈ ఒక్క సినిమాతో అపర్ణ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తో పాటు ఎన్నో అవార్డులను కైవసం చేసుకొంది. స్వతహాగానే బొద్దుగా ఉండే ఈ భామ ఈ మధ్య మరికొంత లావై కనిపించింది. దీంతో నెటిజన్లు తమ నోళ్లకు, చేతులకు పని చెప్పారు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్ లో అపర్ణ మరింత లావుగా కనిపిస్తుండడంతో నెటిజన్లు అమ్మ పాత్రలకే పనికొస్తావ్.. అవే చేసుకో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ఈ ట్రోల్స్ పై అపర్ణ స్పందిస్తూ” నేను మొదటి నుంచి బొద్దుగానే ఉంటాను. మొదట్లో ఈ కామెంట్స్ విని చాలా బాధపడ్డాను. బయటికి వచ్చేదాన్ని కాదు. కానీ ఆ తరువాత తరువాత అలవాటు పడ్డాను. నేను లావుగా ఉన్నానని అమ్మ పాత్రలు చేసుకో అంటున్నారు.. వారిని చూసి నేను జాలి పడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఆకారాన్ని అంచనా వేసి ప్రతిభను గుర్తించలేని స్థితిలో ఉన్నందుకు.. నాజూకుగా ఉంటేనే రాణిస్తాం అనేది తప్పు.. ఇలా నాజూకుగా ఉన్నవారందిరి జీవితంలో సక్సెస్ ఉందా..? అలాంటప్పుడు నా లావు గురించి చర్చ అవసరమా..? ” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అపర్ణ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.