Vishnu Priya: టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఆమె సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే తనను ఆంటీ అని పిలిచినవారిపై కేసు పెట్టి మరీ షాక్ ఇచ్చింది. మీరెవరు నన్ను ఆంటీ అని పిలవడానికి అంటూ నెటిజన్లను ప్రశ్నించిన ఆమె.. ఇలా ఎవరు అన్నా సీరియస్ యాక్షన్ తీసుకుంటానన్నట్లు హెచ్చరించింది. దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు ఆంటీ అని హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ కూడా చేశారు. ఇక ఇదంతా తెల్సిన విషయమే.. తాజాగా ఒక యాంకర్ కమ్ నటి అనసూయను ఆంటీ అనేసి నాలిక్కర్చుకొంది. ఆమె ఎవరో కాదు బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ.
Read Also: Neha Sharma: అందాల ఆరబోయాలంటే ‘చిరుత’ పిల్ల తరువాతే ఎవరైనా..
ఇటీవల శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో జరీ పంచెకట్టు అనే సాంగ్ చేసిన ఈ బ్యూటీ ఆ సాంగ్ ను ప్రమోట్ చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది.. ఇండస్ట్రీలో ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. టక్కున అనసూయ అని సమాధానమిచ్చి వెంటనే తప్పు అయిపోయిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వీడియోపై అనసూయ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం విష్ణు ప్రియ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది.