Rana Daggubati:టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కుటుంబం నేడు తిరుమలలో సందడి చేసింది. నిర్మాత సురేష్ బాబు తన కుటుంబంతో కలిసి నేటి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. సురేష్ బాబు, ఆయన భార్య.. ఇద్దరు కుమారులు రానా, అభిరామ్, రానా భార్య మీహిక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అయితే రానా- మీహిక పెళ్లి అయ్యిన తెల్లారి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కొత్త దంపతులుగా శ్రీవారి ఆశీస్సులు అందుకున్న ఈ జంట మళ్ళీ ఇన్నాళ్లకు ఇలా శ్రీవారి సన్నిధిలో కనిపించారు. దీంతో ఏమైనా విశేషమా అని అభిమానులు గుడ్ న్యూస్ కోసం ఎదురచూస్తున్నారు. రానా- మీహికకు వివాహమై దగ్గరదగ్గర మూడేళ్లు కావొస్తుంది.
ఇటీవల కాలంలో మీహిక ప్రెగ్నెంట్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం కూడా చేసింది. అయినా అభిమానుల్లో ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది. కుటుంబం మొత్తం చాలా రోజుల తరువాత దేవుని దర్శనం చేసుకోవడంతో ఆ ఆశలు మళ్లీ చిగురించాయి.ఏదైనా సంతోషకరమైన వార్తను షేర్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదని, ఫ్యామిలీ విజిట్ అని సురేష్ బాబు చెప్పుకురావడంతో మరోసారి రానా అభిమానులు నిరాశచెందారు. ఇక మరోపక్క మరికొందరు తమ సినిమాలు హిట్ అవ్వాలని స్వామివారిని ప్రార్ధించడానికి వచ్చారని చెప్తున్నారు. రేపు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన శాకినీ డాకినీ సినిమా రిలీజ్ కాబోతుంది.. అంతేకాకుండా అభిరామ్ నటించిన అహింస విడుదలకు సిద్దమవుతుంది. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాలని మొక్కుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకోనున్నాయో చూడాలి.