రైటర్ బీవీయస్ రవి ఇప్పుడు చిత్రసీమలో బహుముఖ పాత్రలు పోషిస్తున్నాడు. ‘సత్యం’ సినిమాతో రైటర్ గా మారిన బీవీయస్ రవి అప్పట్లోనే ఒకటి రెండు సినిమాలలో నటించారు. గత యేడాది వచ్చిన రవితేజ ‘క్రాక్’లో సెటైరికల్ కామెడీ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. దాంతో ఆయనకు నటుడిగానూ పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రవితేజ ‘ధమాకా’ చిత్రంలో బీవీయస్ రవి ఓ పాత్ర చేశాడు. తెర మీద తనను తాను చూసుకోవడం కంఫర్ట్ గా అనిపించిందని, ఇక మీదట…
ప్రస్తుతం సినిమా తన పోకడను మారుస్తుంది. ఒకప్పుడు ముద్దు సన్నివేశాలకు హీరోహీరోయిన్లు ససేమిరా అనేవారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించాలి కాబట్టి.. అయితే ప్రేక్షకులు సైతం ఆలోచన విధానాన్ని మార్చుకొని సినిమాను సినిమాలా చూడడం మొదలుపెట్టడంతో టాలీవుడ్ లో ముద్దు సన్నివేశాలు ఎక్కువైపోతున్నాయి. ఇక కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా లిప్ లాక్ కి సిద్ధం అంటున్నారు. నాగార్జున,నాని, రవితేజ లాంటి వారు కూడా కుర్ర హీరోయిన్లతో పెదవులు కలుపుతున్నారు. అయితే…
గద్దర్ పేరు వినగానే ఆయన ముందున్న ప్రజాగాయకుడు అన్న బిరుదు గుర్తుకు వస్తుంది. ప్రజల పక్షాన నిలచి, వారి కష్టాలను తన గళంలో నింపి ఊరూరా వాడవాడలా పల్లవించి, ప్రభుత్వాలను దారికి తీసుకు వచ్చిన కళాకారుడు గద్దర్. ఆయన పుట్టిన తేదీపై పలు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చాలామంది జనవరి 30వ తేదీన గద్దర్ పుట్టినరోజు అని చెబుతారు. ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. బ్రిటిష్ రాజ్యంలో తెల్లవారి పాలనను వ్యతిరేకిస్తూ…
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ రావణ తరహా పాత్రలో సాయిరామ్ శంకర్ నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్ ను పోస్టర్…
తెలుగు చిత్రసీమలో దర్శకత్వంతో పాటు సంగీతం సమకూర్చిన వారూ ఉన్నారు. ఇక నిర్మాణంతో కూడా స్వరాలు పలికించి రంజింప చేసిన వారు అరుదనే చెప్పాలి. వారిలో అగ్రస్థానంలో నిలుస్తారు పెనుపాత్రుని ఆదినారాయణ రావు. ఆదినారాయణరావు నిర్మాతగా మారకపోయి ఉంటే, మరింత మధురాతి మధురమైన సంగీతం మన సొంతమయ్యేదని సంగీతప్రియులు అంటారు. ఆయన బాణీల్లో అంతటి మహత్తుండేది మరి. తన భార్య నటి అంజలీదేవి పేరుమీద ‘అంజలీ పిక్చర్స్’ సంస్థనూ స్థాపించి మరపురాని చిత్రాలను నిర్మించారు ఆదినారాయణరావు. ఆదినారాయణరావు…
రెండు రోజుల క్రితమే అమూల్ సంస్థ ‘పుష్ఫ’ మూవీ హీరో పాత్రను ఉపయోగిస్తూ, ఓ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. దేశంలో కాస్తంత సంచలనం సృష్టించిన అంశాలు కనిపిస్తే చాలు వాటిని ప్రకటనలుగా మార్చి, దేశ వాప్తంగా హోర్డింగ్స్ లో పెట్టడం అమూల్ సంస్థకు కొత్తకాదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం ‘పుష్ప’ను కరోనా అవేర్ నెస్ కార్యక్రమాలకు ఉపయోగించేస్తోంది. అందులోని ‘తగ్గేదేలే’ డైలాగ్ కు వచ్చిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని, ఈ రకంగా…
ఎక్కడైనా మంచికి ఉన్న విలువ, చెడుకు ఎప్పటికీ లభించదు. మన పురాణాల్లోనూ ఉత్తములకు ఉన్న విలువ, అధములకు ఏ మాత్రం దక్కదు. అయితే ఉత్తములకు కీడు కలిగించిన వారి పేర్లు కూడా వారితో పాటు మననం చేసుకోవలసి వస్తుంది. ఈ ముచ్చట దేనికోసమంటే, మన పురాణాల్లోనే కాదు, తరువాత కూడా రామ అన్న పదానికి ఉన్న విలువ, రామునికి కీడు చేసి, ఆ కారణంగా చనిపోయిన రావణుడి పేరుకు లేదని చెప్పడానికే! ఇప్పటికీ రావణ అన్న పేరు…
టాలీవుడ్‌లో ముద్దుల హోరు కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యువతను సినిమాలకు ఆకర్షించాలంటే లిప్ లాక్ కూడా ఓ ఆయుధమనే చెప్పవచ్చు. ఇంతకు ముందు కూడా ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్100’ సినిమాలు ముద్దులతోనే వసూళ్ళ వర్షం కురిపించాయి. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఏకంగా 15కి పైగా లిప్ లాక్స్ తో యువతకి కిర్రెక్కించగా, ఆర్ఎక్స్ 100లో కార్తికేయ, పాయల్ మధ్య ఘాటైన ముద్దలతో కూడిన రొమాన్స్ పదే పదే రిపీట్ గా ఆడియన్స్ ను థియేటర్లకు పరుగులు…
ఈ సంక్రాంతికి ఒకే ఒక్క టాప్ స్టార్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ జనం ముందుకు వస్తోంది. జనవరి 14న ‘బంగార్రాజు’ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున నటవారసుడు నాగచైతన్య సైతం నటించడం విశేషం. కాగా, వీరిద్దరూ కలసి ఇంతకు ముందు నటించిన ‘మనం’ అప్పట్లో ఘన విజయం సాధించిది. ఇక నాగార్జున తరం హీరోలతో పోలిస్తే సంక్రాంతి సంబరాల్లో ఆయన తక్కువగానే పాల్గొన్నారని చెప్పాలి. అయితే 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో పొంగల్ బరిలోకి దూకి,…
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తన వారసుల్ని చిత్రసీమలో నటీనటులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారుడు క్రాంతితో నట్టికుమార్ స్వీయ దర్శకత్వంలో ‘వర్మ’ (వీడు తేడా) అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి మొదట ‘సైకో వర్మ’ అనే పేరు పెట్టారు. అయితే సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సైకో పదాన్ని టైటిల్ నుండి తొలగించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు నట్టి కుమార్ తెలిపారు. ఓ…