(అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి) భారతీయుల మదిలో అహింసామూర్తిగా గుడికట్టుకున్నారు మహాత్మ గాంధీ. మన దేశానికి సంబంధించిన తొలి డాక్యుమెంటరీస్ లో మహాత్ముడే ఎక్కువగా కనిపించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మహాత్మ గాంధీ చేస్తున్న అహింసా పోరాటాలను నిక్షిప్తం చేయాలని భావించి, ఆ దిశగా డాక్యుమెంటరీలు రూపొందించారు. అలా నిక్షిప్త పరచిన మహాత్ముని దృశ్యాలనే ఈ నాటికీ చూడగలుగుతున్నాం. ముఖ్యంగా దండి వద్ద బాపూజీ చేసిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీపై చిత్రీకరించిన విజువల్స్…
ఈ దసరా పండక్కి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఆ లోటును తీర్చేందుకు చిన్న సినిమాలు భారీగానే పోటీపడుతున్నాయి. మొదట ఒకటిరెండు బడా సినిమాలు వస్తాయనే ప్రచారం జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా థియేటర్ల పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో మిగితా సినిమాలు దసరా బరిలో దిగుతున్నాయి. ఈ నెల 24న దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. పండగ మూడు వారాల ముందే వస్తున్న…
గత నెలాఖరులో సినిమా థియేటర్లను తెరచిన దగ్గర నుండి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సినిమాల విడుదలకు అచ్చి వచ్చే సీజన్ ఎంత మాత్రం కాదు. అయినా… సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెద్ద సినిమాలు వస్తే… తమకు చోటు దక్కదనే భయంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలా జూలై చివరి వారం ఐదు సినిమాలు విడుదలైతే… ఈ నెల ప్రథమార్ధంలో ఏకంగా 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతవరకూ ‘తిమ్మరుసు,…