రెండేళ్ల గ్యాప్‌తో రెండు సినిమాలు చేసి.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు ఆ యంగ్ డైరెక్టర్. దాంతో మూడో సినిమాకే మెగాస్టార్ నుంచి పిలుపొచ్చింది. అందుకే గత రెండేళ్లుగా చిరు కథ పైనే కసరత్తులు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతనికి మెగా షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్.. ఏంటా కథ..? ఆచార్య సినిమా రిజల్ట్ ఎఫెక్ట్.. మెగాస్టార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై పడనుందా అంటే.. ఖచ్చితంగా పడుతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.…
ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు ‘శ్రీరామజయం’ అని రాయడం తెలుగువారికి ఓ సంప్రదాయం. అదే తీరున తెలుగు చిత్రసీమలోనూ శ్రీరామనామమే విజయగీతం పాడించింది. మన భారతదేశంలో రూపొందిన తొలి టాకీ చిత్రంగా ‘ఆలమ్ ఆరా’ నిలచింది. ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలయింది. మంచి విజయం సాధించింది. అందువల్ల ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు దక్షిణాదిన కూడా ఓ సినిమా నిర్మించాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి ఆయన అసోసియేట్ గా ఉన్న తెలుగువారయిన హెచ్.ఎమ్.రెడ్డి కూడా…
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నంతవరకే పేరు ప్రఖ్యాతలు ఉంటాయి.. ఇక హీరోయిన్ల విషయంలో గ్లామర్ మాత్రమే ముఖ్యం.. నడుము సన్నగా ఉండాలి.. వెనక భాగం ఎత్తుగా ఉండాలి అని కొలతలు కొలిచేస్తుంటారు.వారిలో ఏ కొద్దీ మార్పు వచ్చినా ఇండస్ట్రీకి పనికిరావు అని పక్కన పడేస్తారు. దీంతో.. హీరోయిన్లందరూ గ్లామర్ పెంచుకోవడానికి సర్జరీలను నమ్ముకుంటున్నారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వివాదాలతో అమ్మడు నిత్యం వార్తల్లోనే…
థర్డ్ వేవ్ లాక్ డౌన్ తరువాత అన్ సీజన్ అనిపిలిచే డిసెంబర్ ఫస్ట్ ఆఫ్ లో విడుదలైనా ‘అఖండ’ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇక ఇక్కడ నుంచీ తెలుగు సినిమాకు అన్నీ మంచి రోజులే. వరుస విజయాలు వస్తాయి చూడండి. లాక్ డౌన్ లో వాటిల్లిన నష్టం మొత్తం భర్తీ అయ్యేలా వరుసగా వచ్చే చిత్రాలన్నీ విజయం సాధిస్తాయని, సాధించాలని ఆ వేడుకలో పాల్గొన్న వక్తలు అభిలషించారు. గత…
‘విక్రమ్’ అనగానే కమల్ హాసన్ నటించి, నిర్మిస్తున్న ‘విక్రమ్’ చిత్రమని అపోహ పడే ఆస్కారం లేకపోలేదు! కానీ ఇది మరో ‘విక్రమ్’ గురించిన సంగతి. గత యేడాది డిసెంబర్ 31న విడుదలైన ‘విక్రమ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హరిచందన్. నాగవర్మ, దివ్యారావు జంటగా నటించిన ఈ సినిమా తమిళంలోనూ ‘మహావీరన్’ పేరుతో విడుదలైంది. శుక్రవారం హరిచందన్ పుట్టినరోజు కావడంతో తన సినీ ప్రయాణం గురించి హరిచందన్ వివరించారు. ‘చిన్నతనం నుండి సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఏడేళ్ళ…
భావకవులు ఎవరికీ అర్థం కాని పాటలు రాసుకొని తమ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారని కొందరి విమర్శ. అయితే ఊహాలోకంలో విహరించమనే ఐన్ స్టీన్ వంటి మేధావులు సైతం సెలవిచ్చారు. నేటి ఊహ, రేపటి వాస్తవం కావచ్చునని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు. తెలుగునేలపై భావకవితకు పట్టం కట్టి ఊరూరా, వాడవాడలా పలువురు యువకవులను ఊహాలోకాల్లో విహరింప చేసిన ఘనుడు దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి. ఆయన భావకవితకు జేజేలు పలికారు జనం. వాస్తవికతకు దూరంగా ఉండే భావుకత ఎంతవరకు సమంజసం…
‘డిజె టిల్లు’ విజయవంతమైన సందర్భంగా సక్సెస్ మీట్ లో తను ప్రేక్షకులను ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించటం… దానిపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ఆడియన్స్ కు క్షమాపణలు తెలియచేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంలో డిజెటిల్లు విడుదలైన రోజు నేను మాట్లాడిన మాటలు వారికి ఇబ్బంది కలిగించాయన్న వార్త…
టాలీవుడ్ ఫిబ్రవరి రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు ఫిబ్రవరిలో ఏ సినిమాలకు ఇలాంటి పోటీ రాలేదు. సడెన్ గా వచ్చిన భీమ్లా నాయక్ తో యంగ్ హీరోలు పోటీకి సిద్దమంటారా..? లేదా వెనక్కి తగ్గుతారా..? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 25 న మూడు సినిమాలు వరుణ్ తేజ్ గని, శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు, కిరణ్ అబ్బవరం సెబాస్టియన్.. ఇక 24 న అజిత్ వలిమై రిలీజ్ గేట్లను ప్రకటించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాయి. ఇక…
రాజబాబు – ఈ నాలుగక్షరాలు పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్! ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. “నవ్వు నలభై విధాల గ్రేటు” అన్నది రాజబాబు చెప్పిన మంత్రం. తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు రాజబాబు. తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్ గానూ రాజబాబు…