కొత్త సంవత్సరం.. కొత్త ప్రారంభం.. కొత్త జీవితం.. సినీ ఇండస్ట్రీలో గతేడాది కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ జ్ఞాపకాలను వదిలేసి.. న్యూ ఇయర్ లో సరికొత్త విజయాలను అందుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఇక నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త చిత్రాలు.. తమ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్నా “బోళా శంకర్”.. కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయంతో జోష్ పెంచేశాడు. ఒకపక్క సినిమాతో బిజీగా ఉంటూనే మరోపక్క ఆహా ఓటిటీ ప్రమోషన్స్ పనులను కూడా బన్నీ తన బుజాల మీద వేసుకున్నాడు. ఆహా ఓటిటీ ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు అల్లు ఫ్యామిలీ గట్టిగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. టాక్ షో లు, కుకింగ్ షోలు, కొత్త సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో ఆహా.. ఆహా అనిపిస్తోంది. ఇక ఓటీటీ ప్లాట్…
కరోనా ఫస్ట్ వేవ్ తో గత యేడాది, సెకండ్ వేవ్ తో ఈ సంవత్సరం సినిమా రంగానికి గట్టి పరీక్షనే పెట్టాయి. అయితే… యువ కథానాయకులు మాత్రం ఏదో ఒక స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతారని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకుల అంచనాలను తల్లకిందులు చూస్తే, మన యంగ్ హీరోస్ ఈ యేడాది భారీ పరాజయాలను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’…
తెలుగు సినిమా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ప్రతి యేటా 30 శాతం మించి విజయాలను చూడలేకపోతోంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ విజయశాతం 15 నుండి 30 మాత్రమే ఉంటోంది. ఈ యేడాది లాక్ డౌన్ కారణంగా మే, జూన్ మాసాల్లో సినిమా థియేటర్లు మూతపడడంతో ఆ శాతం మరింత తగ్గిందనే చెప్పాలి. 2021 సంవత్సరంలో 203 స్ట్రెయిట్ మూవీస్, 64 డబ్బింగ్ సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అంటే దాదాపు 270 చిత్రాలు వెలుగు చూశాయన్న…
హీరో సిద్దార్థ్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. మొదటి నుంచి సిద్దార్థ్ ఏ విషయమైనా నిస్సంకోచంగా తన మనుసులో ఉన్న మాటను చెప్పే స్వభావం కలవాడు. సామాజిక అంశాల మీద.. ప్రభుత్వ విధానాలు వైఫల్యాల మీద.. సినీ ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో ట్విట్టర్ లో ఏకిపారేస్తాడు. ఇక ఇటీవల సమంత- నాగ చైతన్య విడాకుల సమయంలో సిద్దు వేసిన ట్వీట్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్…
రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. రజనీ మాతృభాష మరాఠీ. పెరిగిందేమో కర్ణాటక రాజధాని బెంగళూరులో. అయినా ఆయనకు తెలుగు నటులు యన్టీఆర్ సినిమాలంటే భలే ఇష్టం. యన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్నిబెంగళూరులో పలు మార్లు చూశానని చెబుతారు. అలాగే యన్టీఆర్ పౌరాణికాలంటే ఆయనకు ఎంతో అభిమానం. ఇక హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా స్టైల్…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిత్ర పరిశ్రమ అయితే కరోనా దెబ్బకు కుదేలయిపోయింది. ఇప్పుడిప్పుడే అన్నింటికి, అందరికి మంచి రోజులు వస్తున్నాయి.. త్యేతర్లు కళకళలాడుతున్నాయి అనుకొనేలోపు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బి.1.1.529 మరో సవాల్ విసురుతోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్వో చెప్తున్న తరుణంలో ఓమిక్రాన్ కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పటికే వాయిదాల మీద వాయిదాల వేస్తూ వస్తున్నా సినిమాలు పరిస్థితి అయితే దారుణమని…
ప్రస్తుతం సినిమాలకు యువత రాజపోషకులని పలువురి అభిప్రాయం. యువత ఏ చిత్రాన్నైనా తొలి రోజు, మొదటి ఆట చూడాలని తపిస్తుంది, నిజమే! కానీ, ఇంటిల్లి పాదిని సినిమాకు తీసుకు రాగల సత్తా ఒక్క బాలలకే ఉంది. ఇది ఈ నాటి నిజం కాదు! బాలలను ఆకట్టుకోవడం వల్లే అనేక చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలు మూటకట్టుకోగలిగాయి. ఇక బాలలను ఆకర్షించే అంశాలతో తెరకెక్కిన చిత్రాలు మరింతగా వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ మధ్య విజయాలను తరచిచూచినా, అందులో…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాలలో సెప్టెంబర్ లో ‘లవ్ స్టోరీ’ చక్కని కలెక్షన్లను రాబట్టి విజేతగా నిలువగా, అక్టోబర్ మాసంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విజయపథంలో సాగింది. దాంతో అన్నదమ్ములు అక్కినేని నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టినట్టు అయ్యింది. అక్టోబర్ నెల ప్రారంభం రోజునే సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. దానితోనే ‘అసలు ఏం జరిగిందంటే?’,…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా జనాలు థియేటర్లకు రావడం పెద్దంతగా జరగడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఆటలతో పాటు నూరు శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సినిమాల విడుదల సంఖ్య పెరిగింది. గతవారం ఐదు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాగా, ఈ వారం ఏకంగా తొమ్మిది చిత్రాలు థియేటర్లకు క్యూ కట్టడం విశేషం. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి రెండే సినిమాలు. ఒకటి నాగశౌర్య హీరోగా సితార ఎంటర్…