సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ రావణ తరహా పాత్రలో సాయిరామ్ శంకర్ నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్ ను పోస్టర్ లో చూపించారు మేకర్స్. దాంతో సినిమా మీద సహజంగానే ఆసక్తి కలుగుతోంది. డైరెక్టర్ వినోద్ విజయన్ తో పాటు ఎడిటర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ‘ఒక పథకం ప్రకారం’ సినిమా కోసం పని చేస్తున్నారని నిర్మాతలు రవి పచ్చముత్తు, గార్లపాటి రమేశ్, వి. విజయన్ తెలిపారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతి సోధి, సముద్ర ఖని, కళాభవన్ మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.