టాలీవుడ్‌లో ముద్దుల హోరు కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యువతను సినిమాలకు ఆకర్షించాలంటే లిప్ లాక్ కూడా ఓ ఆయుధమనే చెప్పవచ్చు. ఇంతకు ముందు కూడా ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్100’ సినిమాలు ముద్దులతోనే వసూళ్ళ వర్షం కురిపించాయి.
అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఏకంగా 15కి పైగా లిప్ లాక్స్ తో యువతకి కిర్రెక్కించగా, ఆర్ఎక్స్ 100లో కార్తికేయ, పాయల్ మధ్య ఘాటైన ముద్దలతో కూడిన రొమాన్స్ పదే పదే రిపీట్ గా ఆడియన్స్ ను థియేటర్లకు పరుగులు తీయించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ వరల్డ్ ఫేమస్ లవర్ లో ట్రై చేసినా అంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయాడు.ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో సినిమాల్లో వరుసగా లిప్ లాక్స్ చోటుచేసుకుంటున్నాయి. ‘శ్యామ్ సింఘ్ రాయ్’ లో నాని, కృతి శెట్టి మధ్య లిప్ లాక్ తో కూడిన ఇంటిమేట్ సీన్ వెండితెరను వేడెక్కించింది.
ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ‘రౌడీ బాయ్స్’ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పరిచయ నటుడు ఆశిష్ తో కలసి చేసిన లిప్ లాక్స్ విడుదలకు ముందే సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఫ్యామిలీ రోల్స్ ని ఎక్కువగా ఇష్టపడే అనుపమ ఇలా ఒక్కసారిగా కట్టలు తెంపి మూతి ముద్దలతో రెచ్చిపోవడం చర్చనీయాంశం అయింది. సినిమాలోని ప్రత్యేక మైన అంశాలలో ఈ లిప్ లాక్స్ ముందు వరుసలో నిలుస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇస్మార్ట్ గర్ల్ నిధి అగర్వాల్ కూడా గ్లామర్ ట్రీట్ లో తాను ఎవరికి తీసిపోనని నిరూపించుకుంది. హీరో ని అంటూ వచ్చిన కొత్త హీరో అశోక్ గల్లా లిప్ప్ ని జుర్రేసింది. అందాలవిందు చేయటమే కాదు లిప్ లాక్ తోనూ రెచ్చిపోయిన నిధి ‘హీరో’కి ఎంత వరకూ ప్లస్ అయిందన్నది తేలాల్సి ఉంది. సో వరుసగా ఇలా టాలీవుడ్ మేకర్స్ మళ్ళీ లిప్ లాక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిలో నాని సక్సెస్ అయ్యాడు. సంక్రాంతికి వచ్చిన ‘రౌడీబాయ్స్, హీరో’ పరిస్థితి ఏమిటన్నది మరి కొన్ని రోజులు ఆగితే కాని తెలయదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.