రైటర్ బీవీయస్ రవి ఇప్పుడు చిత్రసీమలో బహుముఖ పాత్రలు పోషిస్తున్నాడు. ‘సత్యం’ సినిమాతో రైటర్ గా మారిన బీవీయస్ రవి అప్పట్లోనే ఒకటి రెండు సినిమాలలో నటించారు. గత యేడాది వచ్చిన రవితేజ ‘క్రాక్’లో సెటైరికల్ కామెడీ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. దాంతో ఆయనకు నటుడిగానూ పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రవితేజ ‘ధమాకా’ చిత్రంలో బీవీయస్ రవి ఓ పాత్ర చేశాడు. తెర మీద తనను తాను చూసుకోవడం కంఫర్ట్ గా అనిపించిందని, ఇక మీదట కూడా ఎవరైనా ఛాన్స్ ఇస్తే నటిస్తానని బీవీయస్ రవి చెప్పాడు. ఇప్పటికే ‘వాంటెడ్’, ‘జవాన్’ చిత్రాలను డైరెక్ట్ చేశాడు రవి. తాజాగా మరో సినిమా కోసం మెగా ఫోన్ చేతిలోకి తీసుకోబోతున్నాడు.
ఇక కిశోర్ తిరుమలను తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సెకండ్ హ్యాండ్’ను మిత్రులతో కలిసి నిర్మించిన బీవీయస్ రవి ఇప్పుడు రెజీనా ప్రధాన పాత్రధారిగా ‘బ్రేకింగ్ న్యూస్’ మూవీని మిత్రులతో కలిసి నిర్మిస్తున్నాడు. ‘రాహుల్’ ఫేమ్ సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బీవీయస్ రవి కథ, మాటలు అందించాడు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్వకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘ధ్యాంక్యూ’ మూవీకి రవి కథ ఇచ్చాడు. వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’కు రైటింగ్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. అలానే ఏప్రిల్ 1 నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఓ ఇంటర్నేషనల్ వెబ్ సీరిస్ కు రచన చేస్తున్నాడు. నందినీరెడ్డి తెరకెక్కించబోతున్న రెండు సినిమాలకు బీవీయస్ రవి నే కథలు అందిస్తున్నాడు. ఆ రకంగా రవి బిజీ బిజీ!!