ప్రస్తుతం సినిమా తన పోకడను మారుస్తుంది. ఒకప్పుడు ముద్దు సన్నివేశాలకు హీరోహీరోయిన్లు ససేమిరా అనేవారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించాలి కాబట్టి.. అయితే ప్రేక్షకులు సైతం ఆలోచన విధానాన్ని మార్చుకొని సినిమాను సినిమాలా చూడడం మొదలుపెట్టడంతో టాలీవుడ్ లో ముద్దు సన్నివేశాలు ఎక్కువైపోతున్నాయి. ఇక కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా లిప్ లాక్ కి సిద్ధం అంటున్నారు. నాగార్జున,నాని, రవితేజ లాంటి వారు కూడా కుర్ర హీరోయిన్లతో పెదవులు కలుపుతున్నారు. అయితే ఇక్కడి ప్రశ్న ఏంటి అంటే.. ఆ ముద్దు సీన్లకు హీరోయిన్లు ఒప్పుకుంటున్నారా..? లేక డైరెక్టర్ ఒప్పిస్తున్నారా..? అనేది.
మన్మధుడు 2 లో నాగార్జున, కుర్ర హీరోయిన్ అక్షర లిప్ లాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. గీతాంజలి సమయంలో నాగ్ పెట్టిన ముద్దు ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అదే ఇప్పుడు ట్రై చేయాలనుకుంటే ప్రేక్షకులు ఒప్పుకోలేదనే చెప్పాలి. తమకంటే చిన్న హీరోయిన్లతో శృంగార సన్నివేశాలు చేయడం, ఘాడ పెదవి ముద్దులు పెట్టుకోవడం కొంచెం ఎబ్బెట్టుగా ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇక శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో కృతి శెట్టి, నాని ల లిప్ లాక్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు నాని పెదవి ముద్దులు పెట్టింది లేదు. ఈ సినిమాలో అంత గీత దాటవల్సిన అవసరం ఏముంది అని అభిమానులు కొందరు బాహాటంగానే అడిగేస్తున్నారు.
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా మాస్ మహారాజా లిప్ లాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ మూవీ ట్రైలర్ లో మాస్ మహారాజా , మీనాక్షి చౌదరీ ల గాఢ చుంబనం హైలైట్ గా నిలిచింది. రవితేజ కన్నా మీనాక్షి చాలా చిన్నది. అంత చిన్న అమ్మాయితో ముద్దులాట అంటే కొద్దిగా ఎబ్బెట్టుగా లేదా అని రవితేజని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ మేకర్స్ చెప్పే ఒకే ఒక్క సమాధానం .. కథ డిమాండ్ చేసింది.. స్టోరీలో ఫీల్ కోసం చేయాల్సి వచ్చింది” అని చెప్పడం సాధారణమే . అయితే కుర్ర హీరోయిన్లు ఇలాంటి లిప్ లాక్ లకు ఎలా ఒప్పుకుంటున్నారు అని నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.