ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు కోటి రూపాయలుగా… శుక్రవారం రోజున కోటిన్నరాగా నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీ వద్ద అందుబాటులో 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు ఉన్నాయి. ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల పై 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గోనే అవకాశం పోందనున్నారు భక్తులు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యం ఉంది.
ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాపుగా 600 కోట్లు ఆదాయం లభించే అవకాశం ఉంది. అయితే ఉదయస్తమాన సేవా టిక్కెట్లు కేటాయింపు ద్వారా లభించే మొత్తాని చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని పాలకమండలి నిర్ణయించింది. టిక్కెట్ల కేటాయింపు కూడా పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా కేటాయించేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.