గత టీడీపీ హయాంలో రూ. 8 కోట్ల 20 లక్షలతో ముడసర్లోవ వద్ద ట్రాన్సీట్ హాల్ట్ ఏర్పాటు చేశాం. ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులప్పాడ యార్డుకు తరలించాలని దీనిని ఏర్పాటు చేసారు అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకుండా దీన్ని డంపింగ్ యార్డుగా తయారు చేసింది. ఆ డంపింగ్ యార్డు వల్ల పక్కనే ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ జలాలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయి అని తెలిపారు. ఆ కారణంగా స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పిన ఆయన తక్షణమే ఆ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలి అని డిమాండ్ చేసారు. ఇక అధికార పక్షంలో ఉన్న వైసీపీ నేతలు ప్రతిపక్షం మాదిరి డంపింగ్ యార్డ్ తరలింపుపై అధికారులకు వినతిపత్రం ఇస్తున్నారు అని పేర్కొన్నారు.