ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ రేపు ఉ. 9 గంటలకు 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనుంది. రోజుకి 20 వేల చొప్పున 6 లక్షల 20 వేల టిక్కెట్లు విడుదల చేస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున టీటీడీ.. వచ్చే నెల నుండి ఆఫ్‌లైన్‌లో 5 వేల టోకెన్లు జారీ చేయనున్నారు టీటీడీ అధికారులు. రోజుకి 5వేల చొప్పున లక్షా 55 వేల టిక్కెట్లు విడుదల చేస్తారు. ప్రతిరోజూ 5 వేల టోకెన్లు తిరుపతిలో జారీ చేయనున్నారు. ఈనెల 31 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అయితే కరోనా కారణంగా టీటీడీ అన్ని రకాల శ్రీవారి దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్న విషయం తెలిసిందే.