డీజిల్ సెస్ పేరుతో నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణ దూరాన్ని బట్టి కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.140కి పైగా ఆర్టీసీ డీజిల్ సెస్ వసూలు చేయనుంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రతిపాదికన మొత్తం ఛార్జీని నిర్ణయించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస ఛార్జీలను ఆర్టీసీ పెంచింది. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.5 మేర పెంచగా..…
తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు.…
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూనే వున్నాయి. భారత్ బంద్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. విశాఖపట్నం పరిధిలోని రైల్వే స్టేషన్ ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. అనుమనితులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. రైళ్ల రాకపోకలు యధాతథంగా జరుగుతున్నాయి. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో వాల్తేర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బైక్, కారు పార్కింగ్ అనుమతి నిరాకరించారు. అటు, పార్సిల్…
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళుతుంటారు వాహనదారులు. ఇక లారీలు, పెద్ద వాహనాలైతే చెప్పాల్సిన పనిలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు లాఠీలకు పనిచెబుతుంటారు. జరిమానాలతో బుద్ధి చెబుతారు. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. తిరుపతి అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలితో తంతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వ్యక్తి ఏం తప్పుచేశాడో, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు కొడుతున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదు. సామాన్యుడిపై అలా…
తిరుమలలో ఫోటోలు దిగడంతో పాటు మాడవీధుల్లో చెప్పులతో నడవడంతో నయనతార దంపతులు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! ఆచారాలకు విరుద్ధంగా నయా దంపతులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ వర్గాలు సహా టీటీడీ పాలకమండలి సైతం మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే విఘ్నేశ్ శివన్ ముందుకొచ్చి, తమ ప్రవర్తనపై వివరణ ఇచ్చాడు. అలాగే క్షమాపణలు చెప్పాడు కూడా! ‘‘శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని అనుకున్నాం, కానీ కుదరని పక్షంలో చెన్నైలో వివాహం చేసుకున్నాం. వివాహం తర్వాత…
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు బావ.. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు. Wishing @trsharish Bava a happy birthday. May you be blessed with good health and a long life pic.twitter.com/MF7d3nH7Tc — Kavitha Kalvakuntla (@RaoKavitha) June 3, 2022 కాగా.. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి…
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి. తొలుత సత్యనారాయణపురానికి చెందిన ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి పేరు మోనిషా. గుడికి వెళ్ళిన ఈ బాలిక, తిరిగి ఇంటికి రాలేదు. అలాగే.. చెన్నారెడ్డి కాలనీలో 8వ తరగతి చదువుతున్న వంశీ కృష్ణా ఐస్‌క్రీమ్ కోసం వెళ్ళి అదృశ్యమయ్యాడు. అనంతరం లక్ష్మీపురానికి చెందిన వివేక్ కూడా మిస్సింగ్ అంటూ మరో ఫిర్యాదు అందింది.…
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి వేళ ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టార్గెట్ చేశారు మంత్రి రోజా. ఎన్టీఆర్ తనయుడు బాలయ్యను చూస్తే జాలేస్తోందన్నారు రోజా. ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా బాలయ్య ఆరోజుల్లో వుండి వుంటే.. జగన్ సీఎం అయినట్టే బాలయ్య కూడా కీలక పదవిలో వుండేవారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండేదన్నారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకత్వాన్ని…