తిరుపతి జనవాణిలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు నేను రాలేదు.. దేశానికి మూడో ప్రత్యామ్నాయం కావాలి.. ఏపీలో మూడో ప్రత్యామ్నాయం అవసరం. టీడీపీకి, వైసీపీకి నేను కొమ్ముకాయడానికి సిద్ధంగా లేను… వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు పవన్ కళ్యాణ్. రాయలసీమలో దళితుల గొంతును నొక్కిస్తున్నారు…రాయలసీమలో పరిశ్రమలు తీసుకు రారు,ఉద్యోగాలు ఉండవు …రాయలసీమ నేతల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి నోచుకోకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరి,చంద్రగిరి నియోజకవర్గాల్లో చాలాచోట్ల డ్రైనేజి వ్యవస్థ లేదు..ఏడువేల కోట్లుపైగా పంచాయతీ నిధులను దారి మళ్ళించుకున్నారు.. చదువుల సీమ… రాయలసీమ ..రాయలసీమలో మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతోంది. రాయలసీమ ప్రజలు భయపడతున్నంతా కాలం… సీమ అభివృద్ధి చెందదు.. రాజకీయ నేతలను చూసి భయపడి కాదు..ప్రేమతో చేతులు కట్టుకోవాలీ.. ఆత్మగౌరం లేకుండా ఎంతకాలం బతుదాం.. టీడీపీ కాని వైసీపీ కాని కొమ్ముకాయాడానికి రాజకీయాల్లో రాలేదు..ఏపీలో మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. 2009లో కొద్దిమంది నేతల వల్ల పార్టీ పోగొట్టుకోవాల్సివచ్చింది.. ప్రస్తుతం వారు వైసీపీ మంత్రులుగా ఉన్నారు. కుళ్ళు,కుంత్రాలను చిరంజీవి చూడలేకపోయారు..తట్టుకోలేకపోయారు…అందుకే ప్రజారాజ్యం ఉండలేకపొయింది.
నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకే 2014లో టిడిపికి మద్దతు ఇచ్చాను.ప్రజా రాజ్యం పార్టీ ఉండి వుంటే ఇప్పుడు పరిస్థితి వేరే విధంగా వుండేది. తెలంగాణాలో మునుగోడులో పోటీచేస్తే కొన్నిఓట్లు వస్తాయి… దానివల్ల ప్రయోజనం ఉండదన్నారు పవన్. సార్వత్రిక ఎన్నికల్లోనే పోటీచేయాలన్నారు. విధ్వంసక రాజకీయాలు జరుగుతున్నాయి.. ఆ దారుణాలకు చెక్ పెట్టాలంటే శతృవులతో కూడా కలుస్తాం అన్నారు. ఏపీ భవిష్యత్తుకోసం నా అడుగులు ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్.
Read Also: Jayalalithaa Death Case: జయలలిత వైద్యంలో ఎలాంటి లోపాలు లేవు..ఎయిమ్స్ డాక్టర్స్ ప్యానెల్ రిపోర్ట్