Special Trains: తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ఈ మేరకు సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 21, 28 తేదీల్లో తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ట్రైన్ నంబర్ 07481 తిరుపతిలో రాత్రి 9:10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. అటు ఈనెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ట్రైన్ నంబర్ 07482 సికింద్రాబాద్‌లో సాయంత్రం 4:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:20 గంటలకు తిరుపతి చేరనుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, మంత్రాలయం, రాయిచూర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతాయి.
Special Trains Between Tirupati – Secunderabad @drmgtl @drmsecunderabad @drmhyb pic.twitter.com/d3LvIbfMF1
— South Central Railway (@SCRailwayIndia) August 18, 2022
మరోవైపు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే పలు స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. సికింద్రాబాద్-మధురై మధ్య ప్రతి మంగళవారం నడిచే ట్రైన్ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు పొడిగించింది. మధురై-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి బుధవారం రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్-జైపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలును సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు.. అలాగే జైపూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు పొడిగించారు.
https://twitter.com/SCRailwayIndia/status/1560235142659973120/photo/1