Andhra Pradesh: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలపై వైసీపీ రంగులు, రోడ్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై విమర్శలు చెలరేగాయి. గోడలపై ఉన్న దేవుడి బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. తిరుపతి నగరంలోని గోడ చిత్రాలపై జరుగుతున్న ప్రచారం దురుద్దేశపూరితంగా చేస్తున్నారని విమర్శించింది. తిరుపతి నగర వ్యాప్తంగా వెలిసిపోయిన గోడ చిత్రాలను గుర్తించి…
AP High Court: ప్రముఖ హీరో మంచు మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మోహన్‌బాబు, ఆయన కుమారులు తిరుపతిలో ధర్నా నిర్వహించారు. అయితే ఈ ధర్నాపై అప్పటి పోలీసులు పలు కేసులు నమోదు చేయగా.. వీటిపై తిరుపతి కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల మోహన్‌బాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు…
ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలో స్థానిక జనసేన పార్టీ నేత ఇంటిపై దాడి చేశారు దుండగులు… తమ డివిజన్లో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ అడిగినందుకు ఇంటిలోకి దూరి అధికార పార్టీకి చెందిన నేత అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు జనసేన పార్టీ నేతలు.. తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది.. ఒక్కసారిగా ఇంటిలోకి దూరి ఇంట్లోని ఫర్నిచర్, సామాన్లు ధ్వంసం చేసినట్టుగా చెబుతున్నారు.. ఊహించని ఘటనతో జనసేన నేత,…