ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగంగా సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి తుది నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన సుమారు 10-11 వేల వినతులు, అభ్యంతరాలు వచ్చాయి. స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం వుండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషనుకు.. తుది నోటిఫికేషనుకు…
ఎంత పెద్ద మనిషైనా పాములు కనిపించగానే పై ప్రాణాలు పైనే పోతాయి. పాముని చూడగానే అక్కడినించి పరుగు లంకించుకుంటారు. పాములు పగబడతాయా..వెంటాడి కాటేస్తాయా? తప్పించుకున్న వదలవా? పాపాతికేళ్ల క్రితం పాము.. పాము పగతో సినిమాలు రావటం.. పాము పగ మీద బోలెడన్ని విషయాలు తరచూ మాట్లాడుకోవటం కనిపించేది. పాములు పగబడతాయని.. వెంటాడి.. వెంటాడి మరీ కాటేస్తాయని నమ్ముతోంది ఓ కుటుంబం. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని ఒక ఫ్యామిలీని వణికిపోతోంది. మరే కుటుంబం దొరకనట్లుగా.. ఒకే కుటుంబంలోని…
తెలుగు రాష్ట్రాల్లో రాహు కేతు పూజలు, గ్రహణాల సమయంలోనూ తెరిచి వుండే శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో అవకతవకలు జరగడంతో ఈవో పెద్దిరాజు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆలయములో ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరికి ఛార్జి మెమోలు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈఓ పెద్దిరాజు. రాహు కేతు పూజలకు సరైన సమయానికి నాగ పడగలు…
ఏపీలో మండిపోతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు. ముఖ్యంగా వంటగదిలో ఎక్కువగా వాడే ఆయిల్ ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు కిరాణా వ్యాపారులు. తిరుపతిలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. అధిక మొత్త0తో వంటనూనెలు అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడుతున్న దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా నూనె ప్యాకెట్ ల నిల్వ, నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నట్టు…
కోవిడ్ ఆంక్షలను TTD వినియోగించుకున్నట్టుగా ఇంకెవ్వరూ ఉపయోగించి ఉండరు. తమకు అవసరమైతే రూల్స్‌ను బయటకు తీస్తుంది. లేకపోతే వాటిని గాలికొదిలేస్తుంది. ఇంతకీ కరోనా నిబంధనల పేరుతో TTD చేస్తోంది ఏంటి.. చెయ్యనిది ఏంటి? కోవిడ్ పేరుతో ఏకాంతంగానే ఉత్సవాలుదేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులోకి రాకముందే అప్రమత్తమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. జనతా కర్ప్యూ.. లాక్డౌన్ విధించకముందే TTD వాటిని అమలు చేసి చూపించింది. ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకముందే 2020 మార్చి 20…
తిరుమలకు భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో భక్తులు ఏడుకొండల స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. నిన్న 31 వేల మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా వుంటే టీటీడీ ఉదయాస్తమాన సేవా టికెట్లు విడుదల చేసింది టీటీడీ. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్ గా ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయించింది. అర్ధగంటలో చిన్న పిల్లల ఆసుపత్రికి రూ.58 కోట్ల విరాళం వచ్చింది. టీటీడీ వెబ్ సైట్ లో…
ఈరోజుల్లో పెళ్లి పేరుతో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా ముగ్గుర్ని పెళ్ళాడాడు ఆ ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లాలో ముగ్గుర్ని పెళ్ళాడిన నిత్య పెళ్ళికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యలు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడు. ఈ నిత్య పెళ్ళికోడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోట కు చెందిన మంజునాథ్ అంగళ్ళ కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా…
అక్కడ నిబంధనలను గాలికి వదిలేశారా? అడ్డగోలు విధానాలతో అక్రమాలకు రాచబాట వేశారా? పక్కా ప్లానింగ్‌తో అవినీతికి పాల్పడుతున్నారా? లోకల్ లీడర్స్ సహకారంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు దండుకుంటున్నారా? ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. లోకల్ లీడర్స్ అండతోనే అక్రమ నిర్మాణాలుఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.. తిరుపతి. ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని తాకితే.. నిర్మాణాలకు భారీ డిమాండ్. ఈ డిమాండే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కొందరు సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. నగరపాలక…
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు దుండగులు.. తిరుపతి సమీపంలో జనసేన కార్యకర్త సుహాన్ భాషాను అత్యంత కిరాతకంగా నరికి కత్తులతో నరికి చంపారు.. తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద భాషాపై దాడి చేసి హతమార్చారు.. మృతుడు గాంధీపురానికి చెందిన సుహానా భాషాగా గుర్తించారు.. సమాచారం అందుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఇక, స్థానిక నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుహాన్ భాషాను హత్య చేసి…
సైబర్ నేరగాళ్లు ఎవ్వరిని వదలడం లేదు. ప్రముఖులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తికి సైబర్ చీటర్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం కలకలం రేపుతుంది. సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు సైబర్ ఛీటర్ అభిషేక్‌గా పరిచయం చేసుకున్నారు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద రూ. 5కోట్లు మంజూరైనట్లు చెప్పిన అభిషేక్.మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేసిన సైబర్ చీటర్ అభిషేక్. Read Also:…