కలియుగ వైకుంఠం, దక్షిణభారతంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి రూపురేఖలు మారుతున్నాయి ..కుగ్రామంగా మొదలైన తిరునగరి ప్రయాణం …ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకొంది… నూతనంగా ప్లైఓవర్ ,మున్సిపల్ ఆఫిస్,బస్టాండ్, రైల్వే స్టేషను సహా మరికొన్ని కొత్తగా నిర్మితమౌతున్న నేపధ్యంలో తిరుపతి పరపతి మరింత పెరుగుతుందని అంటున్నారు నగర వాసులు..తాజా నిర్మాణాలతో తిరుపతి సరికొత్తగా భక్తులకు,నగరవాసులకు కనువిందుచేస్తూ పెద్ద నగరాలు పోటీగా నిలువనుంది. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం …. ఒకప్పుడు కుగ్రామంగా మొదలైన తిరుపతి ప్రస్తుతం నేడు మహా నగరాల చెంతచెరడానికి సిద్ధంగా ఉంది… తిరుపతి పేరు వినగానే ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరుడు లిప్తకాలం స్మృతిపథంలో మెదలుతాడు.
గోవిందరాజ పట్టణంగా ఆరంభమైన ఊరు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్న ఒక అద్భుతం. అసలు తిరుపతి నగరం పుట్టుక ఎంతో ప్రత్యేకత అని చెప్పాలీ… వేలమందితో మొదలై నేడు నిత్యం లక్షలమంది భక్తులతో భక్తితో ఓలలాడుతున్న దివ్యమైన క్షేత్రం …అలాంటి ఇప్పుడు మరింత శోభను సంతరించుకొవడానికి సిద్ధమైంది..పెరుగుతున్న అవసరాలను దగ్గట్లు పాత భవనాల స్ధానంలో కొత్త నిర్మాణలతో గ్రీన్ సిగ్నిల్ రావడంతో తిరుపతి పరపతి మరింతగా పెరగనుంది.. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శినానికి ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తుంటారు. అందులో సగానికి పైగా ఆర్టీసీ బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేల మందితో రద్దీగా ఉండే తిరుపతి బస్ స్టేషన్ ను మరింత ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Teaser talk: ‘నా మాటే వినవా’ అంటున్న గౌతమ్ రాజు తనయుడు!
ఇందుకోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి బస్టాండ్ ను తయారు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం 12 అంతస్తుల్లో బస్టాండ్ నిర్మించేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ లో తిరుపతి పట్టణానికి వచ్చే వారి కోసం ప్రత్యేక డార్మిటరీ, హోటల్, వసతి సహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మిస్తున్నారు. భక్తులు తిరుపతి బస్టాండ్ లోనే సేద తీరి.. నేరుగా వెంకన్న దర్శనం చేసుకునేలా ఆర్టీసీ ప్లానింగ్ సిద్ధం చేస్తోంది..దానికి సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం …తాత్కాలికంగా నగరంలో మూడు బస్టాండ్ ఏర్పాటు అధికారులు పనిలో పడ్డారు.
రైల్వే స్టేషన్ అభివృద్ధి నగర వాసుల చిరకాల కల. వరల్డ్ క్లాసు రైల్వే స్టేషన్ గా తిరుపతిని అభివృద్ధి చేస్తామంటూ గతంలో పలువురు రైల్వే శాఖ మంత్రులు ప్రకటించారు. అయితే ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితం అవుతూ వచ్చింది. తాజాగా కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. సుమారు 299 కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొన్ని రోజుల క్రితం నూతన రైల్వే స్టేషన్ డిజైన్లను పార్లమెంట్లో విడుదల చేశారు. ఉత్తర దక్షిణ ప్రవేశ మార్గాలు, అధునాతన వసతులతో కూడిన మూడు అంతస్తుల భవన నమూనా చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ పనులు త్వరలో ప్రారంభం అవుతాయాని ఎంపి గురుమూర్తి చెబుతున్నారు ..ఇక తిరుపతి కార్పొరేషన్ కార్యాలయ కొత్త భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది.
ఈనెల 21న ప్రస్తుత కార్యాలయ ప్రాంగణంలో ఈశాన్యం దిక్కున భూమి పూజ చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.రూ.225 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి టెండర్లు కూడా పూర్తిచేశారు.భవననిర్మాణానికి 71 కోట్లు, సీఓసీ సెట్‌పకోసం దాదాపు 146కోట్ల వెచ్చించనున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక భవనం కోసం స్విమ్స్ సర్కిల్ సమీపంలోని పాత ప్రసూతి ఆస్పత్రిని ఎంచుకున్నారు. తాత్కాలిక భవనం కోసం 20వేల చదరపు అడుగుల నిర్మాణాన్ని గత నెలరోజులుగా అధికారులు అన్వేషించారు. స్విమ్స్ సర్కిల్లోని పాత మెటర్నిటీ ఆస్పత్రి, ఇస్కాన్ రోడ్డులోని టీటీడీ బిల్డింగ్‌తో పాటో మరో రెండు ప్రైవేట్ భవనాలను పరిశీలించారు.చివరకు ఖాళీగా వున్న ప్రసూతి ఆస్పత్రి అయితే ఆమోదయోగ్యంగా వుంటుందని అధికారులు భావించినట్టు తెలుస్తోంది. కొత్త భవనం పూర్తవ్వాలంటే దాదాపు రెండేళ్లు సమయం పట్టే అవకాశం వుంది. అప్పటివరకు ప్రసూతి ఆస్పతి భవనంలోనే పౌర సేవలు అందించనున్నారు.అక్కడ మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు వివాదం మారింది… అవన్నీ అటుంచితే మరో రెండేళ్ళ కొత్త మున్సిపల్ భవనంలో రాష్ట్రంలో నెంబరు వన్ గా నిర్మాణం చేపట్టనున్నారు అధికారులు.
శ్రీనివాస సేతు ప్లై ఓవర్…. తిరుపతికి ఒక మణిహారం అనే చెప్పాలి. దాదాపు 684కోట్లతో నిర్మించే భారీ ప్రాజెక్టు … తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, ఆఫ్కాన్ మధ్య ఒప్పందం కుదిరింది.. వారధి నిర్మాణానికి అయ్యే వ్యయం 684 కోట్లలో 67 శాతం 458.28 కోట్లు టిటిడి, తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 33 శాతంతో 225.72 కోట్లు కలసి నిర్మిస్తున్న ప్రాజెక్టు ఇది. వారధి పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి..తిరుపతికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిలతీర్థం వరకు ప్రారంభించి తిరుపతి నగరవాసులకు,శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ కష్టాలు సగానికి తగ్గించారు…ఇక మిగిలిన రెండు దశలు పనులు సైతం డిసెంబరు నాటికి వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.. ఇలా కొత్త రైల్వే స్టేషన్,బస్టాండ్, ఆఫిసులు, ప్లై ఒవర్ తో నగరం అభివృద్ధి పథంలో దూసుకువెళుతోంది… నగరంలో ఇప్పుడు ఎన్నడూ లేనివిధంగా ఇళ్ళ నిర్మాణాలు జోరందుకున్నాయి…ఐఐటి,ఐజర్ లాంటి సంస్థలతో,వర్శిటీలతో తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు …ఇవన్నీ రెండూ మూడేళ్ళలో పూర్తి అయితే సరికొత్త తిరుపతి ఆవిష్కృతం అవుతుందంటున్నారు..ఇటు భక్తులకు ,నగరవాసులు మెరుగైన సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందంటున్నారు.
(తిరుపతి ప్రతినిధి కార్తీక్ సహకారంతో..)