టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది.. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే, సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో యువతకు పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. ఇక తాజాగా తాను కాలినడకన తిరుమలకు వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ అమ్మడు తంత్ర…
తిరుమలలో కిడ్నాప్ కు గురైన మూడేళ్ల చిన్నారి ఘటన సుఖాంతమైంది. ఈరోజు మధ్యాహ్నం ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన అభినయ్ అనే మూడేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించింది. యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద చిన్నారిని ఎత్తుకెళ్లింది. దీంతో హుటాహుటిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సాయంత్రం 5 గంటల…
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సతీసమేతంగా కలిసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఆన్లైన్లో మే నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు.
అయోధ్య ఆలయానికి భక్తజనాన్ని నియంత్రించడం ఇప్పుడు ఒక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాది మందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం ట్రస్ట్ టీటీడీ సహకారాన్ని కోరింది.