Rs. 2000 Notes: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి ప్రతీరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఇక, ప్రతీ రోజూ కోట్లాది రూపాయలు శ్రీవారికి హుండీలో సమర్పించుకుంటారు భక్తులు.. అయితే, ఆర్బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసిన తర్వాత కూడా శ్రీవారి హుండీలో ఆ నోట్లను వేస్తూనే ఉన్నారు భక్తులు.. దీంతో, ఆర్బీఐతో నోట్ల మార్పడి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది టీటీడీ.. ఎట్టకేలకు 2 వేల రూపాయలు మార్పిడిలో టీటీడీ ప్రయత్నం ఫలించింది.. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2 వేల రూపాయల నోట్ల మార్పిడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దుచేసిన విషయం విదితమే కాగా.. అటు తరువాత కూడా శ్రీవారి హుండీలో 2 వేల రూపాయలు నోట్ల పెద్ద సంఖ్యలో సమర్పించారు భక్తులు.. దీనిపై రిజర్వ్ బ్యాంక్ అధికారులతో సంప్రదించి నోట్ల మార్పిడి చేయాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.. దీనిపై సానుకూలంగా స్పందించారు రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు.. 2023 అక్టోబర్ 8వ తేదీ నుండి 2024 మార్చి 22వ తేదీ వరకు ఐదు విడతలో 3 కోట్ల 20 లక్షల రుపాయలు విలువ చేసే 2 వేల రూపాయల నోట్లను మార్పిడి చేసుకుంది టీటీడీ..
Read Also: Jagga Reddy: ఏఐసీసీ కంటే తోపులు ఎవరూ లేరు.. జగ్గారెడ్డి, కోదండ రెడ్డి సమక్షంలో చేరికలు
ఇక, చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ గత నెలలో ప్రకటించింది.. 2 వేల రూపాయల నోటును ఉపసంహరించుకుని 9 నెలలు దాటినప్పటికీ.. ఇంకా రూ.8,470 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది.. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్ టెండర్‌గా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా, 2 వేల రూపాయల కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది మే 19వ తేదీన ఉపసంహరించుకున్న సంగతి విదితమే.