Tirumala Alert: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.. ప్రతీ రోజు తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. ఇక, ఏదైనా ప్రత్యేక రోజుల్లో అయితే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడడం చూస్తుంటాం.. అయితే, శ్రీవారి దర్శనానికి, శ్రీవారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. టీటీడీ వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల అవుతాయని.. మరోవైపు మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు..
Read Also: Dubai Flood: దుబాయ్ వరదలను అంతరిక్షం నుంచి చూస్తే.. ఫోటోలు రిలీజ్ చేసిన నాసా
ఇక, రేపు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకుని.. సంబంధిత టికెట్లను భక్తులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అనుభవాలు చూస్తే.. నిమిషాల వ్యవధిలోనూ టికెట్ల కోటా పూర్తిస్థాయిలో బుక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్న విషయం విదితమే.. మరోవైపు.. తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి.. ఇవాళ మలయప్పస్వామి, రాములవారు, శ్రీకృష్ణ స్వాములకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 62,894 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 22894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లుగా వెల్లడించారు.. తిరుమలలో వసంతోత్సవాలు కారణంగా ఇవాళ పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.