తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.
ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. పిల్లలకు సెలవులు కావడంతో అలాగే పరీక్ష ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. వేసిన కాలం దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అనేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపోతే స్వామివారి దర్శించడానికి ఉచిత సర్వదర్శనానికి గాను అన్ని కంపార్ట్మెంట్లో నిండి బయటకి భక్తులు వేచి ఉన్నారు. Also Read: AP Group 1 Results: గ్రూప్…
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఏప్రిల్ 9న) శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఓ ప్రకటనలో తెలిపింది.
తిరుమల ఘాట్ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వినాయకుడి గుడి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొని ఆగింది. ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు.
నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై.చంద్రచూడ్ అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ఎస్వీయూ న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రేపు ( సోమవారం) తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.