ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. 2023, డిసెంబర్ నెలలో జరిగే ఉత్సవ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నరేంద్ర మోడీ. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. తిరుమల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.
శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఈ రోజు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వచ్చే ఏడాది అంటే 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ..
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు(నవంబర్ 24) ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
రేపటి నుంచి అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం నిరంతరాయంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఇది నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్ ధరను రూ.వెయ్యిగా నిర్ణయించిన స
ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు విచ్చేయనున్నారు.. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.. ఇక, ప్రధాని మోడీ తిరుమల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు.. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.
టీటీడీలో అర్హత వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని.. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కాంట్రాక్ట్ మరియు కార్పొరేషన్ పరిధిలో వున్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యులరైజ్ చేయనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.