తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఆన్లైన్లో మే నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు.
అయోధ్య ఆలయానికి భక్తజనాన్ని నియంత్రించడం ఇప్పుడు ఒక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాది మందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం ట్రస్ట్ టీటీడీ సహకారాన్ని కోరింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది.
తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఈ సందర్భంగా ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు.
తిరుమలలో శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల గురించి, అల్లు అర్జున్ సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.. మొన్నీమధ్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇలా నెలలో కచ్చితంగా రెండు మూడు…
తమిళనటుడు ధనుష్ నటిస్తోన్న.. వెబ్ సిరీస్ షూటింగ్‌కు అనుమతించిన అధికారులు.. ట్రాఫిక్ మళ్లించారు.. దీంతో.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అలిపిరి వద్ద తిరుమల వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు.