25 ఏళ్లు లోపు వారు ‘గోవింద కోటి’ పదిలక్షల నూట పదహారుసార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కార్యక్రమం చేపట్టామని, భక్తులు నుంచి అద్భుత స్పందన వస్తోందన్నారు. నడక మార్గంలో చిరుత పులులు దాడులు అడ్డకట్టకు 5 కోట్లు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి అందించామని టీటీడీ…
Tirumala Temple Rooms: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే.. మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్లైన్లో చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు ఇవ్వడం ద్వారా.. భక్తుల రద్దీని కాస్త తగ్గించొచ్చని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక…
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బోర్డు ఇవాళ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలలో దర్శనాల కోసం నేడు టికెట్లు జారీ చేయనుంది.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఇవాళ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమలలో రద్దీ భారీగా తగ్గింది. ఇవాళ ఆదివారం అయినా రద్దీ పెద్దగా కనిపించడం లేదు.. అయితే, సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో పాటు పరీక్షలు కూడా దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు పేర్కొన్నారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది.
తిరుమలలో మరో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్రోడ్డులోని 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య కలిసి తిరుమల కొండలను వీడియో తీశారు.
ట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి కేంద్ర ఆర్కియాలజీ శాఖ సానుకూలంగా స్పందించింది. అలిపిరి వద్ద వున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం శిథిలావస్థలో వుండడంతో పున:నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది.