Tirumala: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదల చేసిన కాసేపట్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల కొండపై కొలువై ఉన్న కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే.. నడిచి వెళ్లలేని వారికోసం టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయగా.. టికెట్లను హాట్ కేకుల్లా భక్తులు బుక్ చేసుకున్నారు. అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేసిన 4 నిమిషాల్లోనే భక్తులు పొందారు. 20 నిముషాల వ్యవధిలో వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. గంటా 55 నిమిషాల వ్యవధిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అన్ని అయిపోయాయి.
అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక.. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.కాలినడకన వెళ్లలేని వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ అవకాశం ఎంతో మేలు చేస్తుంది. మీరు టికెట్లు బుకు చేసుకోవాలని అనుకుంటే.. https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఇందులో ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు మరిన్ని సేవలూ బుక్ చేసుకోవచ్చు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!