ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరించిన ఓ మహిళను పోలీసులు, ఏటీఎస్‌లు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మానసికంగా బలహీనురాలు అని పోలీసులు చెబుతున్నారు. యోగి 10 రోజుల్లో రాజీనామా చేయకుంటే బాబా సిద్ధిఖీలా చంపేస్తామని నిందితురాలు ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో మెసేజ్ చేసింది.
భద్రత విషయంలో భారత్ రాజీపడదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దసరా సందర్భంగా అన్నారు. ఏ దేశమైనా భారత్ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకాడబోదని అన్నారు.
యూపీలోని అమ్రోహాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. చికిత్స నిమిత్తం ఓ తాంత్రికుడి దగ్గరికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి అసభ్యకరమైన వీడియో తీశాడు. అయితే.. దానిని వైరల్ చేస్తానని బెదిరిస్తూ ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నడు. అంతే కాకుండా.. బాధితురాలి నుంచి లక్ష రూపాయల వరకు దోచుకున్నాడు.
అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని యువతిపై బెదిరింపులకు పాల్పడిన ఘటన యూపీలోని హర్దోయ్‌లో చోటు చేసుకుంది. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి ఒక యువకుడు బాలికకు ఫోన్ చేసి రమ్మని అత్యాచారం చేశాడు.
యూపీలోని కాన్పూర్ లో ఓ ప్రేమికుడు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రేమికుడు.. తన ప్రియురాలి కుటుంబంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నీ కూతురిని తనకిచ్చి పెళ్లి చేయాలని.. లేదంటే రక్తం కళ్ల చూడాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా.. ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే, అక్కడికెళ్లి తీసుకొస్తానని చెప్పాడు. అందుకే ఎవరితోనూ పెళ్లి చేయకని సూచించాడు.
Devadula Pump House: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్‌హౌస్‌లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు 5 మందిని అదుపులో తీసుకున్నారు.
హానీ ట్రాప్ ద్వారా పురుషులను ఆకట్టుకొని తద్వారా డబ్బులు వసూలు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ రాకెట్‌లో భాగంగా మగవారి శృంగార వీడియోలు తీసి.. నిందితులు బెదిరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
‘వండర్ వుమన్’ స్టార్ గాల్ గాడోట్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కూడా సెట్స్ లో బెదిరింపుల తిప్పలు తప్పలేదట. సూపర్ హీరో మూవీ ‘జస్టిస్ లీగ్’ దర్శకుడు జాస్ వెడాన్ అసభ్యంగా ప్రవర్తించాడని, సెట్స్‌లో విషపూరిత పని వాతావరణాన్ని సృష్టించాడని, గాల్ గాడోట్ కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా గాల్ గాడోట్ ఓ ఇజ్రాయెల్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన…