Sex Racket: హానీ ట్రాప్.. వీడియోలు చూపుతూ 50 మంది పురుషులకు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sex Racket: హానీ ట్రాప్ ద్వారా పురుషులను ఆకట్టుకొని తద్వారా డబ్బులు వసూలు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ రాకెట్‌లో భాగంగా మగవారి శృంగార వీడియోలు తీసి.. నిందితులు బెదిరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సుమారు 50 మంది మగవాళ్ల దగ్గర నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు తేలింది. బెంగళూరులో ఓ మహిళ హనీ ట్రాప్‌లో పురుషులను బంధించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసే దోపిడీ రాకెట్‌ను కర్ణాటక పోలీసులు ఛేదించారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేయగా.. కేసులో కీలక నిందితురాలిగా ఉన్న మహిళ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హనీ ట్రాప్‌కి పాల్పడిన ప్రధాన నిందితురాలి పేరు నేహా అలియాస్ మేహర్. మరో ముగ్గురుతో కలిసి ఆమె సెక్స్ రాకెట్ నడిపింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ ద్వారా బాధితులను సెక్స్ కోసం తన నివాసానికి ఆహ్వానించేది. మగవాళ్లకు వలవేసి, ఆ తర్వాత శృంగారం కోసం వాళ్లను తన ఇంటికి ఆహ్వానించేది. శృంగారం చేస్తున్న సమయంలో మరో ముగ్గురు నిందితులు వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. మెహర్‌ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇస్లాం మతంలోకి మారాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని బాధితులను వేధించేవారు.
Read also: Rajanikanth : యోగానంద ఆశ్రమంలో ధ్యానం చేసిన తలైవా…
Also Read
మెహర్ పురుషులతో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నప్పుడు మిగిలిన ముగ్గురు నిందితులు వీడియో తీస్తారు. తరువాత బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఫుటేజీని ఉపయోగిస్తారు. బాధితులను .. వారు మెహర్‌ను వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారాలని లేదా ఆమెకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఈ ముఠా బ్లాక్ మెయిల్ ద్వారా ఇప్పటి వరకు రూ.35 లక్షలకుపైగా వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ ఏడాదిన్నరకు పైగా కొనసాగిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. మెహర్ ఆచూకీ ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. వారి నుంచి ఇప్పటి వరకు రూ.60,000 రికవరీ చేశారు. ఈ ఉచ్చులో 50 మందికి పైగా పురుషులు బలైపోయారని భావిస్తున్నందున, బాధితులు ఎంత మంది ఉన్నారనేది విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో ఒకరు ముఠాపై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులపై తప్పుడు నిర్బంధం మరియు మోసానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 348 మరియు 420 కింద పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!