అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని యువతిపై బెదిరింపులకు పాల్పడిన ఘటన యూపీలోని హర్దోయ్‌లో చోటు చేసుకుంది. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి ఒక యువకుడు బాలికకు ఫోన్ చేసి రమ్మని అత్యాచారం చేశాడు.
Read Also: CPI Narayana: బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుంది..
ఎస్పీ నీరజ్ జాదౌన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 17న బాలిక తండ్రి ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నందు అనే వ్యక్తి తన కూతురి ఫొటోలు, వీడియోలు తీశాడని పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత తన కూతురిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని.. ఫోటో-వీడియో వైరల్ చేస్తానని బెదిరించి తన వద్దకు పిలిచాడని చెప్పాడు. ఆమె తన వద్దకు వస్తే ఆ ఫోటో-వీడియోను డిలీట్ చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో తన కూతురికి ఫోన్ చేసి రమ్మని అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపాడు.
Read Also: Champai Soren: “నా ఆత్మగౌరవం దెబ్బతింది, నాకు మూడే దారులు”.. ఎన్నికల ముందు జార్ఖండ్‌లో సంచలనం..
తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై నిందితుడు నందకిషోర్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే లైన్ సమీపంలో నిందితుడు తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని చుట్టుముట్టడంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. రైల్వే లైన్ దాటుతుండగా ట్రాక్‌పై పడటంతో గాయాలయ్యాయి. దీంతో.. అతన్ని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విచారణ చేపట్టగా.. నిందితుడు నందు చరిత్ర హీనుడని తెలిసింది. అతనిపై బెనిగంజ్ కొత్వాలిలో ఐదు క్రిమినల్ కేసులు నమోదయినట్లు పోలీసులు పేర్కొన్నారు.