Temples Robberies: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. దేవాలయాలే టార్గెట్ గా.. ఏడాదిన్నర కాలంలో మూడు సార్లు ఆలయాల్లో చోరీలు జరిగాయి. తాజాగా మండలంలోని రెండు ఆలయాల్లో గత రాత్రి చోరీ జరిగింది. ఏకశిల పాంబండ రామలింగేశ్వర దేవాలయం ఆవరణలోని అమ్మవారి గుడి గ్రిల్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు.ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లిన ఆలయ సిబ్బంది దొంగతనాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు దుప్పట్లు కప్పుకుని స్విఫ్ట్ కారులో వచ్చి ఆలయ పరిసరాల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Read also: Making Chicken Pizza : చికెన్ పిజా ఇంట్లోనే చేసుకోండిలా …
గతంలో ఆలయంలో చోరీకి మూడుసార్లు విఫలయత్నాలు జరిగాయి. ఇది ఇలా ఉండగా కుల్కచర్ల మండలం దాస్యానాయక్ తండాలోని సేవాలాల్ ఆలయంలో కూడా చోరీ జరిగింది.ఉదయం ఏడు గంటల సమయంలో ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి దొంగతనాన్ని గమనించి తండా వాసులకు సమాచారం అందించారు. అమ్మవారి ఆలయంతో పాటు సేవాలాల్ ఆలయ తాళాలు పగులగొట్టి హుండీలు, విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు తండా వాసులు గుర్తించారు. రాత్రి 1 గంట సమయంలో కొందరు కారులో వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మండల కేంద్రంలో దేవాలయాలే లక్ష్యంగా చోరీలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Ayesha Meera Mother: నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం తేవాలి