Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న పోలీసు ఎన్‌కౌంటర్ల కారణంగా ప్రాణ భయంతో, మోటార్ సైకిల్ దొంగల ముఠా సభ్యుడు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మన్సూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో చేతిలో ప్లకార్డు పట్టుకుని లొంగిపోయాడు. లొంగిపోయిన దొంగను అంకుర్ అకా రాజాగా గుర్తించారు. అతను పట్టుకున్న ప్లకార్డుపై “నన్ను క్షమించు యోగి జీ, నేను తప్పు చేసాను” అని రాసి ఉంది.
మన్సూర్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు ఎన్‌కౌంటర్ భయంతో గ్రామపెద్దలు, అతని కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారని తెలిపారు. “అతను క్షమించమని కోరాడు. అతను ఇకపై నేరం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. నిందితుడు అదుపులోకి తీసుకుని జైలుకు పంపాం. అతడు అనేక కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ” అని పోలీసు అధికారి వెల్లడించారు.
Read Also: Manish Sisodia: మనీష్ సిసోడియాపై మరో కేసు నమోదు చేసిన సీబీఐ
ముఖ్యంగా, పోలీసులకు, అతని గ్యాంగ్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ఇది జరగడం గమనార్హం. ముఠాలోని ఇద్దరు సభ్యులను మంగళవారం అరెస్టు చేశామని, ఒకరు తప్పించుకోగలిగారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఖటౌలీ) రవిశంకర్ మిశ్రా తెలిపారు. నిందితుల నుంచి మూడు బైక్‌లు, అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. నివేదికల ప్రకారం, 2017లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో 9,000 కంటే ఎక్కువ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. పోలీసు రికార్డుల ప్రకారం, ఎన్‌కౌంటర్‌లలో 160 మంది అనుమానిత నేరస్థులు మరణించారు.