Vizianagaram Crime: సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దొంగగా మారిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.. విజయనగరంలో పలు దొంగతనాలకు పాల్పడ్డ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావును అరెస్టు చేశారు పోలీసులు.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా 10 ఏళ్లు పని చేసిన శ్రీనివాసరావు.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.. ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బులు సరిపోకపోవడం.. జల్సాల కోసం దొంగతనాలకు తెగబడ్డాడు.. డబ్బుల కోసం దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్న శ్రీనివాసరావు.. నగరంలో 12 నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఎలాంటి దొంగ అయినా.. ఏదో ఒక సమయంలో దొరకకపోడు కదా.. విజయనగరంలో అనుమానంగా తిరుగుతున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. ఇక, పోలీసుల విచారణలో శ్రీనివాసరావు క్రిమినల్ డేటా బయటకు వచ్చింది.. శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి.. 27 తులాలు బంగారం ఆభరణాలు, 6 కేజీల వెండి ఆభణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, చెడు వ్యవసాలకు బానిసలైన కొందరు ఇలా దొంగతనాలకు పాల్పడుతూ దొరికిపోయిన ఘటనలు చాలానే ఉన్న విషయం విదితమే.