Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో బహిరంగంగానే మృత్యువు ఆట ఆడింది. కొంతమంది సాయుధ వ్యక్తులు ట్రక్కులు మరియు బస్సుల నుండి ప్రయాణీకులను తీసివేసి, వారిని గుర్తించిన తర్వాత, వారిపై కాల్పులు జరిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని అడవులు, ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడిన దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు ధీటుగా సమాధానం చెప్పారు. కాగా.. ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా, సైనికుడు నాయక్ డి రాజేష్, కానిస్టేబుల్ బిజేంద్ర, అజయ్ సింగ్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
Pakistan: ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. తాజాగా పాకిస్తాన్‌లోని బన్నూ సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దున ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఈ సైనిక స్థావరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు తలదాచుకుంటూ అక్కడి నుంచి వారు తమ స్థానిక నెట్‌వర్క్‌ల ద్వారా బారాముల్లా, కుప్వారాతో సహా లోయలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో దాడి జరిగింది. గిరిజన జిల్లాలోని సెక్యురిటీ చెక్‌పోస్టుపై శనివారం ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాదికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ఏడుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మృతుల్లో్ ఉన్నారు. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి జరిగిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన వారం తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. పశ్చిమ ఆఫ్ఘాన్‌లోని హెరాత్ నగరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. షియా మతగురువులే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. నగరంలోని కోరా మిల్లీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
1 Dead and 20 Injured in Bamb Blasts At Kerala: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ దాదాపుగా 2 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం దీన్ని ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్,…
Israel: ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన భీకరదాడిలో ఇప్పటి వరకు 300కు పైగా మంది మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి వచ్చిన ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేశారు.
జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కానుంది. అయితే ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంసాలు సృష్టించే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా భారత భద్రతా దళాలకు సమాచారం వచ్చింది.