జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు ధీటుగా సమాధానం చెప్పారు. కాగా.. ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా, సైనికుడు నాయక్ డి రాజేష్, కానిస్టేబుల్ బిజేంద్ర, అజయ్ సింగ్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
Gurugram: ఆస్పత్రిలో దారుణం.. విదేశీ మహిళా రోగిపై అఘాయిత్యం
బరువెక్కిన హృదయంతో ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా తల్లి మాట్లాడుతూ.. తమ కుమారుడిని చూసి గర్వపడుతున్నామని తెలిపింది. కెప్టెన్ బ్రిజేష్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జన్మించాడని.. తన తండ్రి కూడా ఆర్మీ అధికారి అని పేర్కొంది. కల్నల్ భువనేష్ థాపా (రిటైర్డ్) తన కొడుకు బ్రిజేష్ థాపా తన కుటుంబంలో మూడవ తరం ఆర్మీ ఆఫీసర్ అని తండ్రి చెప్పాడు. బ్రిజేష్ థాపా చిన్నప్పటి నుండి తన తండ్రి నుండి ప్రేరణ పొందాడని.. సైన్యంలో చేరాలని అనుకున్నాడని తల్లి తెలిపింది. తండ్రి భువనేశ్ థాపా మాట్లాడుతూ.. తన కుమారుడిని చూసి గర్వపడుతున్నాని అన్నాడు. ఇది మిలటరీ ఆపరేషన్ అని, ఇలాంటి ఆపరేషన్లలో ఎప్పుడూ ప్రమాదం ఉంటుందని భువనేష్ థాపా అన్నారు. ఇంకా ఎలాంటి ముప్పు వచ్చినా సైనిక సిబ్బంది సీరియస్‌గా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ‘నా కొడుకు తన కర్తవ్యాన్ని పూర్తి భక్తితో, గంభీరంగా నిర్వర్తించాడు’ అని చెప్పాడు. వీరమరణం పొందిన కెప్టెన్ కుటుంబ సభ్యులు డార్జిలింగ్‌లోని లెబాంగ్‌లో నివసిస్తున్నారు.
Amaravati: రాజధానిని నేషనల్ హైవేతో అనుసంధానించేలా సీఆర్డీయే ప్రణాళికలు
మరోవైపు కెప్టెన్ బ్రిజేష్ థాపా తల్లి నీలిమ థాపా కన్నీళ్లు ఆగడం లేదు. తన కుమారుడి త్యాగానికి గర్విస్తున్నానని, దేశానికి అతడు ఎంతో చేశాడని అన్నారు. అయితే ఇది తన కుటుంబానికి తీరని లోటని, తాము ఎంతో బాధపడుతున్నామని నీలిమా థాపా చెప్పింది. డ్యూటీ అంటే డ్యూటీ అని.. ఒక్కసారి క్యాప్, బెల్టు పెట్టుకుంటే డ్యూటీ నుంచి వెనక్కి తగ్గలేదన్నారు. వీరే మన వీర సైనికులు, దేశ సరిహద్దుల్లో దేశప్రజలను రక్షించేందుకు మోహరించారని పేర్కొంది. బ్రిజేష్ క్వాలిఫైడ్ ఇంజనీర్ అని, అయితే అతను సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాడని అమరవీరుడు కెప్టెన్ తండ్రి కల్నల్ థాపా చెప్పారు. ఐదేళ్ల క్రితమే బ్రిజేష్ ఇండియన్ ఆర్మీలో చేరాడని తెలిపారు. కల్నల్ థాపా ప్రకారం.. కెప్టెన్ బ్రిజేష్ చివరిసారిగా జూలై 14న తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు. సోమవారం రాత్రి బ్రిజేష్ బలిదానం కుటుంబ సభ్యులకు తెలిసింది. బ్రిజేష్ ఆర్మీలోని 145 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందినవాడని, 10వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు డిప్యూటేషన్‌పై ఉన్నాడని అమరవీరుడు ఆర్మీ అధికారి తల్లి తెలిపారు. మార్చి నెలలో బ్రిజేష్ సెలవుపై ఇంటికి వచ్చాడని నీలిమా థాపా తెలిపింది. బ్రిజేష్ పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించాడు.. ముంబైలోని సైనిక్ స్కూల్ నుండి తన ప్రారంభ విద్యను అభ్యసించాడు.