జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది భారతీయులు కాగా, ఒకరు నేపాల్‌కి చెందిన వ్యక్తి. ఈ దాడిలో 25 మంది భారతీయులలో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా ఉన్నారు. నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు, విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. రువారం మధ్యాహ్నం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఈ ప్రమాదంలో…
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే (LET) కమాండర్ సైఫుల్లా కసూరి పేరు బయటకు వచ్చింది. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇతడు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ఓ నవ జంట జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వారం రోజుల్లోనే కన్నీళ్లను మిగిల్చింది. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో భర్త ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే భర్త చనిపోవడంతో నవ వధువు గుండెలు పగిలేలా రోధించింది. హనీమూన్ కోసం వెళితే ప్రాణాలే పోయాయి. మృతదేహాన్ని ఇంటికి చేర్చారు అధికారులు. నేవీ అధికారి భార్య శవపేటికకు సెల్యూట్ చేసి వీడ్కోలు పలికింది. “జై హింద్”…
పాకిస్థాన్ కి సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే, కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకి సీసీఎస్ కీలక సమావేశం కానుంది.
Mallikarjun Kharge: పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు.
హల్గామ్ ఉగ్ర దాడితో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. దీని వల్ల కాశ్మీరీల ఉపాధితో పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ దాడి జరగడంతో ఇక్కడికి వచ్చేందుకు టూరిస్టులు భయపడుతున్నారు. అయితే, ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు.
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఇదే ఘటనలో ఓ సెలబ్రిటీల జంట కూడా చిక్కుకుందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రముఖ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం కలిసి పహల్గాం టూర్ కు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతూ సోషల్…
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీపంలో ఉండే బైసరన్ లోయలో పర్యటిస్తున్న పర్యాటకులపై టెర్రరిస్టులు అత్యంత ఘాతుకానికి ఒడిగట్టారు. టూరిస్టులను దగ్గరి నుంచి కాల్చి చంపి పైశాచిక ఆనందం పొందారు. ఇప్పటి వరకు ఈ దాడిలో 28 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి. పాకిస్థాన్…
Terror Attack: జమ్ము కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని బైసరన్ లోయను చూసేందుకు వచ్చిన పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు సుమారు 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు సమాచారం.